ప్రస్తుతం 2026లో ఉద్యోగ వేట అనేది ఒకప్పుడు ఉన్నట్లుగా లేదు. చాలామంది నిరుద్యోగులు లేదా కెరీర్ మార్పు కోరుకునేవారు రోజూ చేసే పని ఒక్కటే.. జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేయడం, అప్లై ఆన్ లైన్ (Job apply online) బటన్ నొక్కడం లేదా రెజ్యూమ్ అప్‌లోడ్ చేయడం. కానీ, వందల సంఖ్యలో అప్లై చేసినా అటువైపు నుంచి కనీసం చిన్న రిప్లై కూడా రాకపోవడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు. మరి దీనికై ఏం చేయాలి?

గ్లాస్‌డోర్ (Glassdoor) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 70% మంది ఉద్యోగార్థులు తమ జాబ్ సెర్చ్ విషయంలో నమ్మకంగా లేరు. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కేవలం మనుషుల చేతుల్లోనే కాకుండా, మనం చూడలేని అల్గారిథమ్స్, ఏఐ (AI) సిస్టమ్స్ చేతుల్లో ఉండటమే.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ఎందుకు సరిపోవు?
నిజానికి ఇప్పటికీ 60% ఉద్యోగ ఆఫర్లు ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారానే వస్తున్నాయి. కానీ, మిగిలిన 40% అనేది నెట్‌వర్కింగ్, రెఫరల్స్ మీద ఆధారపడి ఉంది. కేవలం ఆన్‌లైన్‌లో అప్లై చేసే వారి కంటే, తెలిసిన వారి ద్వారా (Referral) వెళ్లే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం 35% ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే 2026లో మీరు అనుసరించాల్సిన 5 ముఖ్యమైన పద్ధతులు ఇవే..
1.పరిమిత కంపెనీలపై దృష్టి పెట్టండి
వంద కంపెనీలకు ఒకే రకమైన రెజ్యూమ్ పంపడం కంటే మీకు నచ్చిన ఒక 20 కంపెనీలను మాత్రమే ఎంచుకోండి. వాటి సోషల్ మీడియా ఖాతాలను అనుసరించండి. వారు చేసే పోస్టులపై అర్థవంతమైన కామెంట్లు చేయండి. దీనివల్ల ఆ కంపెనీ రిక్రూటర్ల కళ్లలో మీరు పడే అవకాశం ఉంటుంది.
2.మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోండి
మీరు ఏదైనా ఒక రంగంలో నిపుణులైతే.. దానికి సంబంధించిన విషయాలను లింక్డ్‌ఇన్ (LinkedIn) వంటి వేదికలపై పోస్ట్ చేస్తూ ఉండండి. మీరు రాసే విషయాలు వందల మందికి చేరకపోయినా పర్వాలేదు, మీ ప్రొఫైల్ చూసేవారికి మీ పరిజ్ఞానం అర్థమవుతుంది. దీనినే 'డిస్కవరీ మోడ్' అంటారు.
3.బ్యాక్ ఛానెల్ కనెక్షన్లు
జాబ్ కు అప్లై చేసే ముందే ఆ కంపెనీలో పని చేస్తున్న ఎవరితోనైనా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ పేరు వారికి ముందే తెలిస్తే.. మీరు అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమ్ ను వారు ప్రత్యేకంగా చూసే అవకాశం ఉంటుంది.
4.'వీక్ టైస్' (Weak Ties) ఉపయోగించుకోండి
నేరుగా స్నేహితుల ద్వారా కంటే.. స్నేహితులు స్నేహితులు లేదా పాత కొలీగ్స్ ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు మీకు తెలియని కొత్త నెట్‌వర్క్‌లతో సంబంధం కలిగి ఉంటారు. ఇలాంటి 'దూరపు చుట్టరికం' లాంటి పరిచయాలను వాడుకోవడం వల్ల కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
5.నేరుగా సంప్రదించండి
జాబ్ పోర్టల్స్ మీద మాత్రమే ఆధారపడకుండా.. కంపెనీ మేనేజర్లకు లేదా యజమానులకు నేరుగా ఈమెయిల్ చేయడం లేదా కలవడం వంటివి చేయండి. మధ్యవర్తులు లేకుండా చేసే ఇలాంటి ప్రయత్నాలు ఒక్కోసారి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.
చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. 2026లో ఉద్యోగం దొరకడం అనేది కేవలం మీ టాలెంట్ మీద మాత్రమే కాదు. మీరు ఎంతమందికి తెలుసు? అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్లతో పాటు సంబంధాలను (Relationships) పెంచుకోవడంపై దృష్టి పెడితే సక్సెస్ మీ సొంతమవుతుంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications