ఎయిర్‌టెల్ ఫ్రీ వైఫై కాలింగ్: మీ మొబైల్‌లో చేసుకోవచ్చా?

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా తమ కస్టమర్లు వినియోగిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం తెలిపింది. VoLTE నెట్ వర్క్ నుంచి ఏ వైఫై నెట్ వర్క్‌కు అయినా నేరుగా మారే సదుపాయం కలగడంతో భవనాల్లో కూడా కస్టమర్లు స్పష్టంగా కాల్స్ చేసుకునేందుకు వీలు అవుతుందని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ప్రధాన నగరాల్లో కస్టమర్లకు ఉచిత వైఫై కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చినట్లు జనవరి 10న తెలిపింది.

16 బ్రాండ్స్, 100 మోడల్స్..

16 బ్రాండ్స్, 100 మోడల్స్..

16 బ్రాండ్లలో 100కు పైగా మోడల్ స్మార్ట్ ఫోన్లలో వైఫై కాలింగ్ సదుపాయం లభిస్తోందని, మరిన్ని మోడళ్లకు విస్తరించేందుకు ఆయా కంపెనీలతో సంప్రదిపులు జరుపుతున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. నూతన సేవల ద్వారా వైఫై నెట్ వర్క్స్‌ను కూడా కాల్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చునని, దీంతో పాటు ఇళ్లలో, కార్యాలయాల్లో కాల్స్ చేస్ సమయంలో నిరాటంకంగా VoLTE నుంచి వైఫైకి మారవచ్చునని తెలిపింది.

అదనపు ఛార్జీలు లేవు

అదనపు ఛార్జీలు లేవు

ఉచిత వైఫై కాల్స్ కోసం అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఎయిర్‌టెల్ తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద వివిధ నగరాల్లో ప్రారంభించగా మంచి స్పందన లభించింది. కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించింది.

ఏయే బ్రాండ్స్‌లో వైఫై సౌకర్యం

ఏయే బ్రాండ్స్‌లో వైఫై సౌకర్యం

iPhone 6S సహా ఆపై అన్ని యాపిల్ ఫోన్లలో వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది. Samsung S10, S10 , S10e, M20, One Plus 6, 6T, షియోమీ రెడ్‌మి K20, రెడ్‌మి K20 ప్రో, పోకో F1, Samsung J6, శాంసంగ్ A10s, శాంసంగ్ On6, శాంసంగ్ M30s, వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7T, వన్ ప్లస్ 7T ప్రో లలో వైఫై కాలింగ్ సౌకర్యం ఉంది.

యాపిల్

యాపిల్

యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 7, ఐఫోన్ 8, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ X,ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లలో ఈ సౌకర్యం ఉంది.

శాంసంగ్

శాంసంగ్

శాంసంగ్‌లోని శాంసంగ్ గెలాక్సీ జె6, ఎ10ఎస్, ఆన్‌6, ఎం30ఎస్, ఎస్10, ఎస్10 ప్లస్, ఎస్10ఇ, ఎం20, నోట్ 10, నోట్ 9, నోట్ 10 ప్లస్, ఎం30, ఎ30ఎస్, ఎ50ఎస్, గెలాక్సీ ఎం30ఎస్, గెలాక్సీ ఏ10ఎస్, గెలాక్సీ ఏ50ఎస్, గెలాక్సీ నోట్ 9 తదితర స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

షియోమీ

షియోమీ

షియోమీ రెడ్‌మి కె20, కె20 ప్రొ, పోకో ఎఫ్‌1, రెడ్‌మి 7ఎ, రెడ్‌మి 7, రెడ్‌మి నోట్ 7 ప్రొ, రెడ్‌మి వై3, పోకో ఎఫ్1 ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.

వన్ ప్లస్

వన్ ప్లస్

వన్ ప్లస్ 7, 7టి, 7 ప్రొ, 7టి ప్రొ, వన్ ప్లస్ 6, 6టి, స్మార్ట్ ఫోన్లలో ఎయిర్ టెల్ ఫ్రీ వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఆసుస్

ఆసుస్

అసుస్ బ్రాండ్‌కు చెందిన జెన్ ఫోన్ ప్రొ, జెన్ ప్రొ మ్యాక్స్ లలో కూడా ఎయిర్ టెల్ ఫ్రీ వైఫై కాలింగ్ సౌకర్యం ఉంది. జియోలో మాత్రం ఇది అందుబాటులో లేదు.

కూల్ ప్యాడ్

కూల్ ప్యాడ్

కూల్ ప్యాడ్ బ్రాండ్‌కు చెందిన కూల్ 3, కూల్ 5, నోట్ 5, మెగా 5సి, నోట్ 5 లైట్ లలో ఎయిర్ టెల్ ఫ్రీ వాయిస్ కాల్ అందుబాటులో ఉంది.

మైక్రోమ్యాక్స్

మైక్రోమ్యాక్స్

మైక్రోమ్యాక్స్ దేశీయ మొబైల్ బ్రాండ్. వీటిలో జియో, ఎయిర్ టెల్ ఉచిత వైఫై కాలింగ్ అందుబాటులో ఉంది. ఇన్ఫినిటీ ఎన్12, ఎన్11, బి5లలో ఈ సౌకర్యం ఉంది. కాగా, జియో మైక్రోమ్యాక్స్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి తేలేదు.

మరిన్ని...

మరిన్ని...

వివో బ్రాండ్‌లో వి15ప్రొ, వై17,

టెక్నో బ్రాండ్‌లో ఫాంటం 9, స్పార్క్ గో ప్లస్, స్పార్క్ గో, స్పార్క్ ఎయిర్, స్పార్క్ 4, స్పార్క్ 4 - కేసీ2జే, కామన్ ఏస్2, కామన్ ఏస్ 2ఎక్స్, కామన్ 12 ఎయిర్, స్పార్క్ పవర్,

స్పైస్ బ్రాండులో ఎఫ్311, ఎం5353,

ఐటెల్ బ్రాండులో ఏ46,

ఇన్ఫినిక్స్ బ్రాండులో హాట్ 8, ఎస్5 లైట్, ఎస్5, నోట్ 4, స్మార్ట్ 2, నోట్ 5, ఎస్4, స్మార్ట్ 3, హాట్ 7,

మొబిస్టార్ బ్రాండులో సీ1, సీ1 లైట్, సీ1 షైన్, సీ2, ఈ1సెల్ఫీ, ఎక్స్ 1 నాచ్,

జియోనీలో ఎఫ్ 205 ప్రో, ఎప్ 103 ప్రో,

జోలో బ్రాండ్‌లో జడ్ ఎక్స్,

పానాసోనిక్‌లో పీ100, ఎలూగా రే700, పీ 95, పీ 85 ఎన్ఎక్స్‌టీ... మొదలగు వెరైటీలలో ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+