ప్రభుత్వరంగ SBI నుంచి ప్రయివేటు దిగ్గజం HDFC బ్యాంకు వరకు అన్ని బ్యాంకుల్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) ట్రాన్సాక్షన్స్ ఈ రోజు (డిసెంబర్ 16) నుంచి 24×7 అందుబాటులోకి వచ్చాయి. SBI, HDFC, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ICIC సహా అన్ని కమర్షియల్ బ్యాంకుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల.. ఏ సమయంలోనైనా నెఫ్ట్ ట్రాన్సుఫర్ ఉపయోగించుకోవచ్చు. సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఏడాదిలో ప్రతి సమయంలోను అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెసులుబాటు కల్పించింది.
NEFT ట్రాన్సాక్షన్ టైమింగ్స్ ఇదివరకు ఉదయం గం.8 నుంచి సాయంత్రం గం.6.30 వరకు ఉంది. ఇప్పుడు ఏ సమయంలోనైనా నెఫ్ట్ ద్వారా ట్రాన్సుఫర్ అంటే కస్టమర్లు పేమెంట్ చేసుకోవడానికి ఎంతో వెసులుబాటు దొరికినట్లే. అలాగే, ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు ఓపెన్ ఉన్న రోజునే అందుబాటులో ఉండగా, ఇప్పటి నుంచి ప్రతి రోజు రౌండ్ ది క్లాక్ ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగ సమయాల్లో బ్యాంకులు తెరిచే వరకు వేచి ఉండకుండా ఇప్పుడు అత్యవసర బదలీ సౌకర్యం ఉంది.

ఈ చర్య భారత్‌లోని డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించేవిధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే కస్టమర్లు ఐఎంపీఎస్ కంటే నెఫ్ట్ ద్వారా ఎక్కువ మొత్తాలను బదలీ చేయవచ్చు. IMPS ఏ రోజైనా బదలీ చేసుకోవచ్చు. కానీ రూ.2 లక్షల పరిమితి ఉంది. నెఫ్ట్‌పై ఆ పరిమితి లేదు. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేలా వ్యవస్థను నవీకరించాలని ఆర్బీఐ... బ్యాంకులకు సూచించింది.
డిజిటల్ ట్రాన్సాక్షన్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా నెఫ్ట్ ట్రాన్సుఫర్ పైన ఆర్బీఐ ఛార్జీలను ఎత్తివేసింది. కాబట్టి వీటిపై ఆర్బీఐ నుంచి ఎలాంటి ఛార్జీలు లేవు. అలాగే, ట్రాన్సుఫర్ పైన ఎలాంటి మినిమం పరిమితి లేదు. అలాగే, గరిష్ట పరిమితి మాత్రం బ్యాంకు నుంచి బ్యాంకుకు మార్పులు ఉంటాయి.


Click it and Unblock the Notifications