అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్ డ్రా మార్పులు, పెనాల్టీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి గుడ్ న్యూస్. నెలవారీ మినిమం బ్యాలెన్స్ పరిమితిని సవరించింది. దీంతో కస్టమర్లు వారి అకౌంట్లలో తక్కువ మొత్తాన్ని కలిగి ఉన్నప్పటికీ పెనాల్టీలు ఉండవు. తగ్గించిన పరిమితి కంటే కూడా బ్యాలెన్స్ తక్కువ ఉంటే మాత్రం పెనాల్టీ ఉంటుంది. సవరించిన వాటిలో మినిమం బ్యాలెన్స్‌తో పాటు నగదు ఉపసంహరణ, డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ఈ సవరించిన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్

యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్

అక్టోబర్ 1వ తేదీ నుంచి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000

- సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000

- రూరల్ కేంద్రాల్లో రూ.1,000

- బ్యాంకు ఖాతాలో మినిమం మంత్లీ బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

మెట్రో, అర్బన్ బ్రాంచీల్లో ఛార్జీలు

మెట్రో, అర్బన్ బ్రాంచీల్లో ఛార్జీలు

- మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచీల్లో మంత్లీ బ్యాలెన్స్ లేకుంటే ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

- అకౌంట్‌లో బ్యాలెన్స్ 50 శాతం (రూ.1500) లేకుంటే ఛార్జీ రూ.10+జీఎస్టీ

- అకౌంట్ బ్యాలెన్స్ 50 శాతం కంటే తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.12+జీఎస్టీ.

- అకౌంట్ బ్యాలెన్స్ 75 శాతం కంటే కూడా తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.15+జీఎస్టీ.

సెమీ అర్బన్ బ్రాంచీల్లో ఛార్జీలు

సెమీ అర్బన్ బ్రాంచీల్లో ఛార్జీలు

- సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచీల్లో మంత్లీ బ్యాలెన్స్ లేకుంటే చెల్లించవలసిన ఛార్జీలు...

- అకౌంట్‌లో బ్యాలెన్స్ 50 శాతం లేకుంటే ఛార్జీ రూ.7.50+జీఎస్టీ

- అకౌంట్ బ్యాలెన్స్ 50 శాతం కంటే తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.10+జీఎస్టీ.

- అకౌంట్ బ్యాలెన్స్ 75 శాతం కంటే కూడా తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.12+జీఎస్టీ.

రూరల్ బ్రాంచీల్లో ఛార్జీలు

రూరల్ బ్రాంచీల్లో ఛార్జీలు

- రూరల్ ప్రాంతాల్లోని బ్రాంచీల్లో మంత్లీ బ్యాలెన్స్ లేకుంటే చెల్లించవలసిన ఛార్జీలు...

- అకౌంట్‌లో బ్యాలెన్స్ 50 శాతం లేకుంటే ఛార్జీ రూ.5+జీఎస్టీ

- అకౌంట్ బ్యాలెన్స్ 50 శాతం కంటే తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.7.50+జీఎస్టీ.

- అకౌంట్ బ్యాలెన్స్ 75 శాతం కంటే కూడా తక్కువగా ఉంటే ఛార్జ్ రూ.10+జీఎస్టీ.

అక్టోబర్ నుంచి NEFT, RTGS ఛార్జీలు

అక్టోబర్ నుంచి NEFT, RTGS ఛార్జీలు

- అక్టోబర్ 1వ తేదీ నుంచి నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఇలా ఉంటాయి.

- NEFT ఛార్జీలు ఇలా...

- రూ.10,000 వరకు ట్రాన్సాక్షన్: రూ.2 + GST

- రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు: రూ.4 + GST

- రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు: రూ.12 + GST

- రూ.2 లక్షలు అంతకుమించి : రూ.20 + GST

RTGS ఛార్జీలు

RTGS ఛార్జీలు

- రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్: రూ.20 + GST

- రూ.5 లక్షలకు పైన ట్రాన్సాక్షన్: రూ.40 + GST

డిపాజిట్స్

డిపాజిట్స్

- పొదుపు ఖాతాల్లో నగదు డిపాజిట్ నెలలో 3 లావాదేవీల వరకు ఉచితం

- ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.50 + జీఎస్టీ

- నాన్ హోమ్ బ్రాంచీలో అయితే డిపాజిట్ పరిమితి రూ.2 లక్షలు. అంతకుమించి పరిమితిపై నాన్ హోమ్ బ్రాంచీ మేనేజర్ నిర్ణయం తీసుకుంటారు.

విత్ డ్రా

విత్ డ్రా

- అకౌంట్‌లో రూ.25,000 మంత్లీ బ్యాలెన్స్ ఉండేవారికి నెలలో రెండు ఉచిత ఉపసంహరణలు అదనంగా ఇస్తారు.

- రూ.25,000 నుంచి రూ.50,000 నగదు ఉంటే నెలకు 10 ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్‌లు ఉంటాయి.

- ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన అనంతరం రూ.50 + GST

- ఎస్బీఐ శాలరీ అకౌంట్ హోల్డర్స్‌కు అన్ని లొకేషన్‌లలో ఉచిత అన్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్ లిమిట్. ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఉచితం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+