సాధారణంగా బ్యాంక్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ ఉండాలనే విషయం తెలిసిందే. ఆయా బ్యాంకు, ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అయితే శాలరైడ్ వంటి కొన్ని అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ వర్తించదు. అంటే జీరో బ్యాలెన్స్ ఉండవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఆఫర్ చేస్తోంది. బ్యాంకు అకౌంట్‌ను జీరోతో ప్రారంభించి, ఏమాత్రం అమౌంట్ లేకుండా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. శాలరైడ్‌కు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది. వీరికే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారు డబ్బులు సేవింగ్స్ చేసుకునేందుకు వీలుగా ఎలాంటి ఫీజులు, ఛార్జీలు లేకుండా అకౌంట్ ఇస్తారు. ఇతర సేవింగ్స్ ఖాతాలకు ఉన్న వెసులుబాట్లు అన్నీ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌దారులకు ఉంటాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏయే సందర్భాల్లో ఇస్తారో తెలుసుకోండి....

SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్
SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్.. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. దీనిని ఇండివిడ్యూవల్స్ తెరవవచ్చు. KYC డాక్యుమెంట్లు ఇవ్వడం ద్వారా ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్ కింద ఖాతా తెరిచిన వారికి డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు ఇస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.

వడ్డీ రేటు
రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్‌కు ఇచ్చే వడ్డీ రేటునే జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు కూడా ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది. ఖాతాలో రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నవారు 3.25 శాతం వడ్డీని పొందుతారు. అదే సమయంలో రూ.1 లక్ష కంటే తక్కువ మొత్తం కలిగిన వారు రూ.3.50 శాతం వడ్డీని పొందుతారు.

PMJDY
- PMJDY (ప్రధానమంత్రి జన్ ధన్ యోజన) కింద కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవవచ్చు. అందరికీ బ్యాంకు సేవలు, ఫైనాన్షియల్ సర్వీస్ ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ దీనిని ప్రారంభించారు.
- ఎస్బీఐ పెహ్లా కదమ్, పెహ్లా ఉదాన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా జీరో బ్యాలెన్స్ ఖాతానే. అయితే ఈ ఖాతాలు ప్రత్యేకంగా చిన్నారుల కోసం.

శాలరీ అకౌంట్
ఎస్బీఐ శాలరీ అకౌంట్ కూడా జీరో బ్యాలెన్స్ ఖాతానే. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, డిఫెన్స్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, కార్పోరేట్ కార్యాలయాలు, ఇనిస్టిట్యూషన్స్ వంటి వివిధ రకాల సెక్టార్‌లలోని వారికి ఈ సౌకర్యం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications