ప్రయాణీకులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్స్ బుక్ చేసేవిధంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) ప్రోత్సహిస్తోంది. వెబ్‌సైట్‌ను అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కొన్ని క్లిక్స్‌తో టిక్కెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇందులో భాగంగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఇలా చేయవచ్చు...

ఎస్బీఐ కార్డ్ ద్వారా పేమెంట్.. స్టెప్ బై స్టెప్
- ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ https://www.irctc.co.in/nget/train-search లాగిన్ కావాలి.
- మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే రిజిస్టర్ కావాలి. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.
- Plan My Travel and Book Ticket ఆప్షన్‌లో డిపార్చర్, అరైవల్ స్టేషన్ వంటి సమాచారం ఇవ్వండి. అలాగే తేదీ, జర్నీ చేయబోయే క్లాస్ వంటి వాటిని

ట్రెయిన్‌ను ఎంచుకోండి
- IRCTC డిస్‌ప్లేలో కనిపించే ట్రెయిన్ జాబితా నుంచి మీరు వెళ్లవలసిన ట్రెయిన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- ఆ తర్వాత Book Ticket పైన క్లిక్ చేయండి.
- ప్రయాణీకుల వివరాలు ఇవ్వాలి. మీకు టిక్కెట్లు చేరేందుకు మీ ఇంటి అడ్రస్‌ను కన్‌ఫర్మ్ చేయాలి.
- ఆ తర్వాత టిక్కెట్‌కు అయ్యే అమౌంట్ ఎంతనో డిస్‌ప్లే అవుతుంది.

SBI కార్డు ద్వారా పేమెంట్
- ఆ తర్వాత State Bank of India పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. దీంతో మీరు ఎస్బీఐ ఆన్‌లైన్ సైట్‌కు వెళ్తారు.
- ఎస్బీఐకి చెందిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి. ఆ తర్వాత పేమెంట్ కన్‌ఫర్మ్ చేయండి.
- ట్రాన్సాక్షన్ విజయవంతమయ్యాక ట్రాన్సాక్షన్ ఐడీ, డేట్ ఆప్ ట్రాన్సాక్షన్ మీకు వస్తుంది.
- ఆ తర్వాత IRCTC టిక్కెట్స్‌ను మీరు పేర్కొన్న అడ్రస్‌కు డెలివరీ చేస్తుంది. టిక్కెట్ డెలివరీ బాధ్యత IRCTCదే.

టిక్కెట్ క్యాన్సిల్ చేయాలంటే...
టిక్కెట్ క్యాన్సిల్ చేసేందుకు కంప్యూటరైజ్డ్ రైల్వే టిక్కెట్ కౌంటర్‌కు వెళ్లండి. మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. అయితే ప్రతి ట్రాన్సాక్షన్ పైన రూ.10 సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. రైలు ప్రయాణీకులకు గరిష్ట ప్రయోజనాలు అందించేందుకు IRCTC... SBIతో జత కట్టింది. ఎస్బీఐ ప్లాటినమ్ కార్డుతో ఆఫర్లు ఇస్తోంది. టిక్కెట్ బుక్ చేస్తే రివార్డు పాయింట్స్ వస్తాయి. ఎస్బీఐ ప్లాటినమ్ కార్డు ఉపయోగిస్తే మీరు దాదాపు టిక్కెట్ ఉచితంగా పొందినట్లుగా ఉంటుంది.. ఇప్పటికే 350 రివార్డు పాయింట్స్‌లా ఫ్రీబీస్ ప్రొవైడ్ చేస్తోంది. 1.8 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీలు మాఫీ అయ్యే అవకాశముంది. 2.5 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జీ తగ్గవచ్చు. రైల్వే బుకింగ్ పైన పది శాతం వ్యాల్యూ బ్యాక్ ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications