ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరి. ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఎన్ని ఉద్యోగాలు మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి మారినప్పుడు ఎన్నో ప్రాధాన్యతలు మారుతాయి. ఫైనాన్షియల్‌గా కూడా మార్పులు ఉంటాయి. కానీ పీఎఫ్ అకౌంట్ విషయంలో మాత్రం ఎలాంటి చింతా లేదు.
ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ ఈస్తుంది. దీని ఆధారంగానే ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్‌లో మార్పు ఉండదు. అయితే ఈ పీఎఫ్ అకౌంట్‌ను పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో మీ శాలరీలోని కొంతమొత్తంతో పాటు యాజమాన్యం కూడా కొంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది.

ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ మార్చుకోవాలి
కంపెనీ మారినప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ మార్చుకోవడం మరిచిపోవద్దు. మీ సేవింగ్స్ అమౌంట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. పీఎఫ్ అమౌంట్ ఎంత ఎక్కువ కాలం మెయింటైన్ చేస్తే అంతమేరకు ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. అయిదేళ్లలోపు పీఎఫ్ అకౌంట్‌లోని అమౌంట్ తీసుకుంటే ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు.

పీఎఫ్ ఖాతా ట్రాన్సుఫర్ స్టెప్
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్లో... https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లాగిన్ కండి. అక్కడ మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ టైప్‌తో ఎంటర్ అవండి.
ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌లోని 'One Member - One EPF Account (Transfer Request)' ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్, పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ధృవీకరించుకోవడం మంచిది.
Get details పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ గత కంపెనీకి చెందిన పీఎఫ్ ఖాతా వివరాలు చూడగలుగుతారు.

పీఎఫ్ ఖాతా ట్రాన్సుఫర్ స్టెప్స్
ఆ తర్వాత పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ నుంచి ధృవీకరించిన ఆధారాలు ఉండాలి. మీరు పాత కంపెనీని ఎంచుకోవచ్చు. అక్కడ మెంబర్ ఐడీ, యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి.
ఇది పూర్తయ్యాక తదుపరి దశలో మీకు OTP వస్తుంది. క్లిక్ చేసి సబ్‌మిట్ చేస్తే, ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్టర్డ్ మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. OTPని అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి, సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు ఫాం 13ని నింపవలసి ఉంటుంది. ప్రస్తుత, పాత కంపెనీల పీఎఫ్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. ట్రాన్సుఫర్ క్లెయిమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్‌మిట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పది రోజుల్లో పూర్తవుతుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications