మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!
న్యూఢిల్లీ: మీరు బ్యాంకుల నుంచి ఏదైనా లోన్ తీసుకున్నారా? సక్రమంగా చెల్లించడం లేదా? లోన్ సరిగ్గా చెల్లించకుంటే ఆ బ్యాంకులో తదుపరి లోన్ రావడం ఇబ్బంది అవుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. తాజాగా, మరో ట్రబుల్ ఫేస్ చేసే పరిస్థితులు ఎదురు కానున్నాయి. లోన్ డిఫాల్టర్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్! ఇక నుంచి మీరు లోన్ తీసుకొని, దానిని చెల్లించకపోయినట్లయితే ప్రభుత్వం నుంచి తప్పించుకునే అవకాశాలు లేకపోవచ్చు.

డిఫాల్టర్స్ ఆస్తుల వివరాలు PSBతో పంచుకోవాలి
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విజ్ఞప్తి మేరకు లోన్ డిఫాల్టర్స్ ఆస్తులు, అకౌంట్స్
వివరాలను బ్యాంకులతో పంచుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ... ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సూచించింది. అంటే, ఇక నుంచి బ్యాంకులు డిఫాల్టర్స్ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని పొందుతాయి. దీంతో బ్యాంకులు కూడా వారి నుంచి మనీ రికవరీ చేసుకునేందుకు సులభం అవుతుంది. ఈ నిర్ణయంతో డిఫాల్టర్స్ నుంచి పబ్లిక్ మనీని రికవరీ చేసినట్లవుతుంది.

PSB విజ్ఞప్తి మేరకు..
వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి పలుమార్లు వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ప్రజాప్రయోజనం కోణంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. లోన్ డిఫాల్టర్స్‌కు సంబంధించిన ఇమ్మూవబుల్ (స్థిర) ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇస్తే లోన్ రికవరీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని బ్యాంకులు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. రుణ ఎగవేతదారులకు సంబంధించిన ఆస్తుల సమాచారం పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులతో పంచుకోవడం ప్రజాప్రయోజనం కోసమేనని పేర్కొంది. అయితే ఈ సమాచారాన్ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ బ్యాంకులతో పంచుకుంటుందని తెలిపింది.

మనీ రికవరీ పెరుగుతుంది
సీబీడీటీ ఆదేశాల ప్రకారం... డిఫాల్టర్స్‌కు సంబంధించిన వివరాలను బ్యాంకులు ట్యాక్స్ డిపార్టుమెంట్ నుంచి పొందవచ్చు. వారి ఆస్తుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ పొందవచ్చు. ఈ మార్గం ద్వారా రుణ ఎగవేతదారుల నుంచి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరింత వేగంగా లోన్ రికవరీ చేయవచ్చు. గత కొన్నేళ్లుగా బ్యాంకుల్లో రుణఎగవేతదారులు పెరుగుతున్నారు. విజయ్ మాల్యా, నీరవ్, మెహుల్ చోక్సీ వంటి వారు పెద్ద ఎత్తున ఎగవేశారు.


Click it and Unblock the Notifications