ఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను మరో బ్రాంచీకి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండిలా...
ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీ బ్యాంక్ ఖాతాను ఆన్‌లైన్ ద్వారానే ట్రాన్సుఫర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదివరకు ఆయా బ్యాంకుల్లో ఏ సేవలు పొందాలన్నా సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంటర్నెట్, ఆన్‌లైన్ అందుబాటులోకి వచ్చాక అన్ని సేవలు ఇంట్లో కూర్చునే పొందే సదుపాయం లభించింది. స్మార్ట్ ఫోన్ ఉంటే డబ్పులు ట్రాన్స్‌ఫర్ మొదలు అన్ని సేవలు పొందవచ్చు. ఎస్బీఐ అకౌంట్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారా మరో బ్రాంచీకి మార్చవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా మీ బ్రాంచీ మార్చుకోవచ్చు
ఇదివరకు బ్రాంచ్‌ను మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి, ఫామ్స్ పూర్తి చేయవలసి వచ్చేది. కొన్ని రోజులు ఎదురు చూడవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎస్బీఐ దీనిని సులువు చేసింది. మీరు ఎస్బీఐ అకౌంట్ కలిగి ఉంటే, దీనిని మరో బ్రాంచీకి మార్చుకోవాలనుకుంటే ఇలా చేయండి.

ఇలా చేయండి
- ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ www.onlinesbi.com లోకి వెళ్లండి.
- Personal Banking బ్యాంకింగ్‌ను సెలక్ట్ చేసుకోండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
- అప్పుడు హోంపేజీ పైన e-services ట్యాబ్ కనిపిస్తుంది.
- Transfer of savings account పైన క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ట్రాన్సుఫర్ చేసుకోవాలనుకునే అకౌంట్‌ను సెలక్ట్ చేయండి.
- మీరు ఒకే అకౌంట్ నెంబర్ కలిగి ఉండే డిఫాల్ట్‌గా అది సెలక్ట్ అవుతంది.

కొత్త బ్రాంచీ కోడ్ ఎంటర్
- ఏ బ్రాంచీకి మీ అకౌంట్‌ను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచీ కోడ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత Get Branch Code పైన క్లిక్ చేయండి.
- మీరు అప్ డేట్ చేసిన బ్రాంచీ కోడ్ ఆధారంగా బ్రాంచీ పేరు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది.
- ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయండి. అనంతరం Submit పైన క్లిక్ చేయండి.
- మీరు సబ్‌మిట్ చేసిన వివరాలు, పాత బ్రాంచీ, కొత్త బ్రాంచీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Confirm పైన క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.
- ఆ తర్వాత హైసెక్యూరిటీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి, confirm పైన క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications