న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారం పాలసీ మీటింగ్ జరగనుంది. ఏడు ఫేజ్‌లలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభం కానున్నాయి. దానికి సరిగ్గా వారం రోజుల ముందు ఆర్బీఐ రెపో రేటును తగ్గించనుందని చెబుతున్నారు. ఇంతకుముందు గత ఫిబ్రవరిలో రెపో రేటును తగ్గించింది. దీంతో గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి ఈఎంఐల భారం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద డబ్బు తీసుకున్నప్పుడు దానిపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు.

ఎన్నికలకు ముందు రెపో రేటు
పాలసీని సులభతరం చేయాలని ప్రభుత్వం నుంచి సెంట్రల్ బ్యాంకు పైన ఒత్తిడి ఉందని అర్థమవుతోందని, ఏప్రిల్, జూన్ నెలల్లో రెండుసార్లు మీటింగ్స్ ఉన్నాయని, కానీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా రేట్ కట్ జూన్ కంటే ముందు.. ఏప్రిల్‌లోనే కావొచ్చునని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు వారం రోజుల ముందు రేట్‌కట్ ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ క్రెడిట్ ప్రభుత్వానికి వెళ్తుందంటున్నారు. ఆర్బీఐ రేట్ కట్ చేసినా.. ఆ ప్రయోజనం రుణదాతలకు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవని, కాబట్టి ఇది నిష్ఫలం అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. రాంగ్ పరిస్థితుల్లో రేట్ కట్ చేస్తే అది రూపాయి క్షీణత, స్థూల అస్థిరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తే అది ఆర్థిక వ్యవస్థకు మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణులు ఏకగ్రీవంగా బీజేపీ బెట్టర్ అని చెబుతున్నారట. అదే సమయంలో కాంగ్రెస్ లేదా విపక్షాల కూటమి బెట్టర్ అని ఎవరూ చెప్పడం లేదట.

రెపో రేటు తగ్గిస్తారని ఆశలు
మరోవైపు, జీడీపీ వృద్ధి రేటును ఏడు శాతానికి పైగా కొనసాగించాలంటే కీలకమైన వడ్డీ రేట్లు మరింత తగ్గించడం ఒక్కటే మార్గమని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి వృద్ధి రేటు మందగించిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే పరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించాలని, రెపో రేటును పావు శాతం తగ్గిస్తుందని మార్కెట్ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చిందని, ద్రవ్యోల్భణం, వృద్ధి రేటు గణాంకాల ఆధారంగా ఆర్బీఐ రెపోరేటును మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్బీఐ మీటింగ్
కాగా, ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ పాలసీ మీటింగ్ అనంతరం ఏప్రిల్ 4వ తేదీన రెపో రేటును పావు శాతం తగ్గించి... 6.00 శాతానికి తీసుకు వస్తుందని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి. అయితే, వచ్చే ఏడాది మిడిల్ వరకు ఆర్బీఐ రేట్స్ ఇలాగే ఉంచాలని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్భణం ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం కంటే తక్కువగా ఉంది. ఏడు నెలలుగా ఇలాగే ఉన్న ద్రవ్యోల్భణం ఈ ఆర్థిక సంవత్సరానికి యావరేజ్‌గా 4 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫుడ్, ప్యూయల్ మినహాయిస్తే, ప్రధాన ద్రవ్యోల్భణం 5.5 శాతంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications