ఉమాంగ్ యాప్ (యునిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల సేవలు పొందవచ్చు. ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంల సేవలను పొందవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. సమయం ఆదా అవుతుంది. పీఎప్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. గ్యాస్ బుకింగ్, మొబైల్ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ వెసులుబాటు కూడా ఉంది. ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోకుండానే పైవాటితో పాటు ఆధార్, పాన్, డిజిలాకర్ వివరాలు కూడా చుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, డెస్క్‌టాప్, టాబ్స్‌లలోను ఉమాంగ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు. యూఏఎన్ అకౌంట్, రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా వివరాలు చూసుకోవచ్చు. యాక్డివ్ యూఏఎన్, ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ మొబైల్ ఉంటే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చూసుకోవచ్చు.

స్టెప్ 1
యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు ఏపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం ఉమాంగ్ యాప్ ఓపెన్ చేశాక మీరు ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంచుకోండి. దీనిపై క్లిక్ చేయండి. మీకు ఈఫీఎఫ్ఓ పేజీ కనిపిస్తుంది. అక్కడ మీకు ఎంప్లాయి అండ్ ఎంప్లాయర్ సెంట్రిక్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్, పెన్షనర్ సర్వీసులు కనిపిస్తాయి.

స్టెప్ 2
employee centric service పైన క్లిక్ చేయాలి. అక్కడ మీకు రెండు సేవలు కనిపిస్తాయి. ఒకటి వ్యూ-పాస్‌బుక్, మరొకటి రెయిజ్ క్లెయిమ్ అని ఉంటుంది. మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి View passbook పైన క్లిక్ చేయండి. మీరు వ్యూ పాస్‌బుక్ ట్యాబ్ పైన క్లిక్ చేయగానే లాగిన్ డిటైల్స్ అడుగుతుంది.

స్టెప్ 3
మీ UAN నెంబర్ అడుగుతుంది. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేశాక, Get OTP పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ సమయంలో మీ మొబైల్ నెంబర్ యాక్టివ్‌లో ఉండాలి. మీ వద్దే ఉంచుకోవాలి. ఎందుకంటే ఓటీపీ ఎంటర్ చేసేందుకు మీకు కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత తిరిగి వ్యూ పాస్‌బుక్ పైన క్లిక్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. మీరు ఉద్యోగం మారినప్పటికీ యూఏఎన్ సంఖ్య మారదు. శాశ్వతంగా ఒకటే ఉంటుంది.


Click it and Unblock the Notifications