For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించడమెలా?

కొన్నిసార్లు, శ్రామికులు తమ సంపాదనతో రోజు గడుపుకోవడానికి కూడా ఇబ్బందిపడతారు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ప్రజలలో సామర్థ్యానికి లోటేమీ లేకపోయినా చేసే పనిపై తగినంత అవగాహన ఉండటం తప్పనిసరని నిపు

|

సాంకేతిక ఆధునికతకు అనుగుణంగా జీవనశైలిలో మార్పులవలన జీవితమనేది మరింత క్లిష్టతరంగా మారింది. ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే విపరీతమైన కాంపిటీషన్ ని ఎదుర్కోవలసి వస్తోంది. కష్టానికి తగినట్టుగా జీతం ఉండటం కూడా అరుదైపోతోంది. ఒకవైపు ఆదాయం పెరగకపోవడం, మరొకవైపు ఖర్చులు పెరగటం వలన కూడా ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా ఎక్కువ ఆదాయం పొందటమెలా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మ‌దిని కలచివేస్తోంది.

చాలా సందర్భాలలో, ఒక వ్యక్తి ఎంత కష్టపడి పనిచేశాడు అనే విధానం మీద కంటే చేసే పనిని ఎంత సమర్థవంతంగా చేశాడు అనేదానిపై డబ్బు సంపాదన ఆధారపడుతోంది. శక్తిసామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించి ఒక అంచనాతో విశ్లేషణాపూర్వకంగా పనిని పూర్తిచేసినట్లైతే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

కొన్నిసార్లు, శ్రామికులు తమ సంపాదనతో రోజు గడుపుకోవడానికి కూడా ఇబ్బందిపడతారు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ప్రజలలో సామర్థ్యానికి లోటేమీ లేకపోయినా చేసే పనిపై తగినంత అవగాహన ఉండటం తప్పనిసరని నిపుణుల అభిప్రాయం.
ఇండియాలో సులభంగా రోజుకి రూ.1,000 సంపాదించుకునేందుకు కొన్ని మార్గాలు:

1. మొమోస్ అమ్మకం

1. మొమోస్ అమ్మకం

ఇండియా అనేది దాదాపు 3250 వెరైటీల వంటకాలకు నిలయంగా ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ పై ఇండియన్స్ కు మక్కువ ఎక్కువ. వీధుల్లో లభించే ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇండియన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ లలో దాదాపు 70 శాతం వరకు చిన్న దుకాణాలది అలాగే చిన్న విక్రేతలదే పైచేయి. ఇటువంటి ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే పెట్టుబడి కూడా అత్యంత తక్కువ. ఇటువంటి, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ లో రోజుకి రూ.1,000 సులభంగా సంపాదించవచ్చు.

అటువంటి ఫాస్ట్ ఫుడ్ డిష్ లలో మోమోలాడి ప్రత్యేకమైన స్థానం. గత కొన్నేళ్లుగా ఈ వంటకం అనేకమంది ప్రజల ఆదరాభిమానాలను పొందుతూనే ఉంది. సౌత్ ఆసియన్ డంప్లింగ్ రకానికి చెందిన ఈ వంటకాన్ని తిన్నా పొట్టలో తేలికగానే ఉంటుంది. అయితే, పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని మొమోస్లను అత్యంత నాణ్యతతో తయారుచేస్తే విజయం మీదే. వివిధ రకాల సృజనాత్మక ఫిల్లింగ్స్తో మీరు కస్టమర్లను మీ స్టాల్ కి ఆకర్షించవచ్చు. మీరు గనక మంచి నాణ్యతను అలాగే పరిశుభ్రతను పాటిస్తూ ఈ వంటకాన్ని కస్టమర్లకు నచ్చే విధంగా అందచేస్తే రోజువారీ ఖర్చులతో పాటు లేబర్ కాస్ట్ కూడా సులభంగా అధిగమిస్తారు. మీరంటూ ప్రత్యేకంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలతో నిబద్దతతో కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకోవాలన్న విషయాన్ని మరచిపోకూడదు.

తూర్పువైపుకి చెందిన వారు అమ్ముతున్న మొమోలకి కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అందువల్ల, ఒకవేళ మొమో స్టాల్ ని తెరవాలని అనుకుంటే మీరు ఆ ప్రాంతానికి చెందినవారిని కస్టమర్లకు మొమోలను అమ్మెందుకు నియమించుకోండి. మీరుండే సిటీని బట్టీ రూ.5,000 నుంచి రూ.10,000 నెలజీతం మీద మీకు అటువంటి వారు సులభంగా పనిలోకి కుదురుతారు. అంతేకాక, మీరు సులభంగా రా మొమోలను కనిష్టంగా ఒక రూపాయికి అలాగే గరిష్టంగా పన్నెండు రూపాయలకు కొని ఆస్వాదించడానికి సిద్ధమైన ప్లేట్ మొమోలను రూ.30 కి విక్రయించవచ్చు. ఆ విధంగా మీరు ఒక ప్లేట్ పై మీరు ఇన్వెస్ట్ చేసినదానికన్నా రెండున్నరింతల లాభాన్ని ఆర్జించవచ్చు. ఆ విధంగా, మీరు 50 ప్లేట్స్ ను విజయవంతంగా అమ్మినట్లైతే రోజుకి రూ.1,000 సులభంగా సంపాదించవచ్చు.

ఒక ప్లేట్ ధర = రూ.30

50 ప్లేట్ల ధర = రూ.30*50 = రూ.1500 (1 రోజు అమ్మకం)

నెలవారీ ఆదాయం = రూ. 1,500*30 = రూ. 45,000

లాభం = మొత్తం సంపాదన - (అద్దె + జీతాలు) = 45,000 - (5,000+10,000)

నెలవారీ లాభం = రూ. 30,000

అంటే రోజుకు రూ.1,000.

లీగల్ ఫార్మాలిటీస్ కి సంబంధించి మీరు ఎక్కడైతే షాప్ ని తెరవాలని అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి చెందిన మునిసిపల్ లేదా పంచాయత్ ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాతపూర్వకంగా అప్లికేషన్ ను రాసి అందులో మీ అవుట్లెట్ పేరుని అలాగే బిజినెస్ పేరుని పేర్కొనాలి. కుదిరితే లే అవుట్ ప్లాన్ ను కూడా జోడించాలి. అలాగే, ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ను కూడా జతచేయాలి.

2. కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్

2. కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్

ఈ మధ్యకాలంలో కంటెంట్ రైటింగ్ తో పాటు ఎడిటింగ్ జాబ్స్ కి విశేషదారణ లభిస్తోంది. ఆయా వెబ్సైట్ల రిక్వయిర్మెంట్ లకు తగినట్టుగా కంటెంట్ లను అందించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరమవుతుంది. అలాగే, మీరు అందించే కంటెంట్ ఉపయోగపడే విధంగా ఉండాలి. కంటెంట్ యూనిక్ గా కూడా ఉండాలి. కంటెంట్ ని చదవడం ప్రారంభించగానే పూర్తిగా చదవాలనిపించేలా యూజర్ ఫ్రెండ్లీ అప్రోచ్ కలిగి ఉండాలి. ఇటువంటి స్కిల్స్ మీకున్నట్టయితే ఈ విధమైన జాబ్ కి మీరు అర్హులైనట్లే. ఇటువంటి జాబ్ కి ప్రస్తుత సినారియోని అర్థం చేసుకుని ఇంటర్నెట్ తో పాటు సోషల్ మీడియా ట్రెండ్స్ ని విశ్లేషించగల సామర్థ్యం ముఖ్యం. ఒక టాపిక్ ను సరైన విధంగా రాసి ఆ తరువాత ఎడిటింగ్ లో అవసరమైన సవరణలు చేసి అత్యుత్తమమైన కంటెంట్ ను క్లయింట్లకు అందించాలి. ఆ విధంగా మీరు రీడర్ కు నాణ్యతతో కూడిన ఉపయోగకరమైన ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ ను అందించగలరు. ఫ్రెషర్లకు ఆర్టికల్ కి రూ.200 వరకు ఇస్తారు. అనుభవజ్ఞులకి రూ.10,000 వరకూ ఇస్తారు. సంబంధిత కంటెంట్ ను గ్రహించి సరైన కీవర్డ్స్ ను వాడి చదువరులను ఆకర్షించడంలోనే మీ నైపుణ్యం ఉపయోగపడుతుంది. ఇలా నిబద్దతతో పనిచేస్తే మీదైన రీతిలో మీరు ముందుంటారు. డాక్యుమెంటేషన్ తో పాటు రైటింగ్ ప్రొసీజర్స్ అనేవి మీకు ఆదాయాన్ని మరింత పెంచే కొన్ని నైపుణ్యాలు. రైటర్స్ వీక్లీ తో పాటు హబ్ పేజెస్ అనేవి మీరు సబ్మిట్ చేసే ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసే ప్లాట్ఫారంగా తోడ్పడతాయి. ఆ విధంగా మీరు డబ్బు సంపాదించవచ్చు.

ప్రతి ఒక్క కంపెనీ తమ రైటర్లకు తమ పద్దతిలో చెల్లింపుచేస్తాయి. కొన్ని, ప్రతి పదానికి (రూ.1 నుంచి రూ.10) పే చేస్తే మరికొన్ని ఆర్టికల్ చొప్పున అంటే ఆర్టికల్ కి రూ.200 నుంచి రూ.20,000 వరకు చెల్లిస్తాయి. ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రకారం, మీరు బాగా రాస్తే మీరు బాగా రీసెర్చ్ చేసిన 2000 పదాల ఆర్టికల్ ని రెండు రోజుల్లో పూర్తిచేయగలరు. ఆ విధంగా మీరు రెండురోజులకు గానూ రూ.2000లను ఛార్జ్ చేయగలరు. కాబట్టి, ఒక నెలలో మీరు 15 ఆర్టికల్స్ ను పూర్తి చేస్తే మీరు సులభంగా సగటున రోజుకు రూ.1000 వరకు సంపాదించగలుగుతారు.

3. ప్రాడక్ట్ రివ్యూస్

3. ప్రాడక్ట్ రివ్యూస్

ఈ మధ్య కాలంలో రివ్యూస్ పై ప్రజలు అనేక విధాలుగా ఆధారపడుతున్నారు. ఏదైనా సినిమా చూడాలన్నా రివ్యూ చదువుతున్నారు. ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా రివ్యూపై ఆధారపడుతున్నారు. కాబట్టి, రివ్యూలకి మార్కెట్ ని శాసించే సామర్థ్యం ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సైట్లతో పాటు కంపెనీలు తమ ప్రాడక్ట్ పై నిష్పాక్షికమైన రివ్యూని అందచేయమని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. అందుకు తగిన పారితోషికాన్నిఅందిస్తున్నాయి. ఆ విధంగా ప్రకటనలతో పాటు కొన్ని మిగతా అంశాల వల్ల తమ ప్రాడక్ట్ ల అమ్మకం దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నాయి. వారికి వారి ప్రాడక్ట్స్ పై ఫీడ్ బ్యాక్ కావాలి. సరైన రివ్యూ పోస్ట్ చేసినందుకు పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. అలా, మంచి రివ్యూలు లభించిన ఒక కంపెనీ యొక్క బ్రాండ్ విశ్వసనీయత అమితంగా పెరగడంతో కస్టమర్లకు ఆయా ప్రాడక్ట్స్ పై నమ్మకం ఏర్పడుతుంది. వారి సోషల్ మీడియాలో కానీ బ్లాగ్స్ లో కానీ లేదా యూట్యూబ్ లో కానీ రివ్యూస్ ని పోస్ట్ చేయవచ్చు. అమెజాన్, టైడ్ అలాగే లోరియల్ వంటి కొన్ని కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ని రివ్యూల కోసం ఉచితంగా ఇస్తాయి. అలాగే, తమ ప్రోడక్ట్స్ ని పరీక్షించినందుకు ప్రోడక్ట్ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు కూడా పే చేస్తాయి. కొన్ని ప్రాడక్ట్స్ గురించి వినియోగదారులకి అస్సలు తెలియదు. అందుచేత, అటువంటి ప్రాడక్ట్స్ గురించి వినియోగదారులకు తెలియచేయడం కోసం ఈ రివ్యూలు ఉపయోగపడతాయి. ఆ విధంగా మీరు అందించే రివ్యూస్ కి కూడా ఫ్యాన్ ఫాలోవింగ్ పెరుగుతుంది.

మీ స్వంత వెబ్సైట్ లో గాని లేదా స్వంత బ్లాగ్ లో గాని ఆయా ప్రాడక్ట్స్ గురించి రివ్యూలను అందించవచ్చు లేదా Choice.com, angieslist.com, tripadvisor.in వంటి సైట్లలో కూడా మీ రివ్యూలను పొందుపరచవచ్చు. గూగులమ్మను అడిగి అటువంటి వెబ్సైట్ల లిస్ట్ ను తెలుసుకోవచ్చు.

4. అవసరమైనవారికి బ్యాక్ లింక్ లను అందించడం

4. అవసరమైనవారికి బ్యాక్ లింక్ లను అందించడం

ప్రతి వెబ్సైట్ కు డొమైన్ అథారిటీ అనేది జతచేయబడి ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకుని సెర్చ్ ఇంజిన్ అనేది ఆ వెబ్సైట్ పై నమ్మకం ఏర్పరచుకుని ర్యాంకింగ్స్ కై తోడ్పడుతుంది. లెవల్ 1 నుంచి లెవల్ 100 వరకు వెబ్సైట్ల డొమైన్ ఆథారిటీ అనేది మారుతూ ఉంటుంది. ప్రారంభంలో, ప్రతి వెబ్సైట్ కు లెవల్ 1 కి చెందిన డొమైన్ అథారిటీని కేటాయిస్తారు. ప్రభుత్వ వెబ్సైట్లకు ఉన్నత స్థాయికి చెందిన డొమైన్ ఆథారిటీని కేటాయిస్తారు. అలాగే, వికీపీడియా, గూగుల్, ఫేస్ బుక్ వంటి కొన్ని వెబ్సైట్లని సీడ్ వెబ్సైట్స్ అనంటారు. వీటి డొమైన్ అథారిటీ లెవల్ అనేది 100. ఆ విధంగా వాటి ర్యాంక్ అత్యుత్తమంగా ఉండటం వలన సంబంధిత కంటెంట్స్ లో ఇవి తరచూ కనిపిస్తూ ఉంటాయి.

ఒక సీడ్ వెబ్సైట్ లేదా ఏదైనా అత్యుత్తమ డొమైన్ అథారిటీ కలిగిన వెబ్సైట్ లో ఏదైనా తక్కువ డొమైన్ అథారిటీ కలిగిన వెబ్సైట్ రెఫర్ చేయబడితే (బ్యాక్ లింక్ ద్వారా) రెఫెర్ చేయబడిన లో డిఏ వెబ్సైట్ కి తగిన బూస్ట్ లభించినట్టే. అందువలనే, లో డిఏ (డొమైన్ అథారిటీ) కలిగిన వెబ్సైట్ ఓనర్లు ప్రసిద్ధి చెందిన బ్లాగర్ల కోసం అలాగే కంటెంట్ రైటర్ల కోసం తెగ అన్వేషిస్తుంటారు. వీరి ద్వారా హై డిఏ కలిగిన వెబ్సైట్లలో తమను రెఫర్ చేయడం వలన వారికి తగిన పారితోషికాన్ని అందిస్తారు. ఇది, ఇద్దరికీ ఉపయోగకరమే. అటు రైటర్లకి ఎక్కువ మొత్తం లభిస్తుంది ఇటు వెబ్సైట్లకి తగిన ఆదరణ లభిస్తుంది.

ఔత్సాహికుల యొక్క సేవలను ప్రపంచానికి తెలియచేయడానికి Fiverr అనే వెబ్సైట్ అద్భుతమైన ప్లాట్ఫారంగా పనిచేస్తుంది. రూ.300 నుంచి రూ.10,000 వరకు ఆయా లింకుల టైపులను (డూ ఫాలో లింక్ లేదా నో ఫాలో లింక్) బట్టి అలాగే మీరు లింక్ ఇచ్చే వెబ్సైట్ డీఏతో పాటు కంటెంట్ బట్టి మీరు ఛార్జ్ చేయవచ్చు.

ముగింపు

ముగింపు

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో నిలకడగా ఉండాలంటే, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మరిన్ని విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండాలి. సృజనాత్మకంగా ఒక అడుగు ముందుండే వారిని ప్రోత్సహించడానికి ఈ ప్రపంచం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీలోని ఆలోచనలకు చేయూతనిచ్చి ప్రపంచానికి తెలియచేయండి. అప్పుడు, మనకి సాధారణంగా కనిపించే కొన్ని విషయాలే ఆదాయాన్ని పెంపొందించే అంశాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో టీ బిజినెస్లకు ఆదరణ విపరీతంగా ఉంది. ఈ ఆదరణ ఇంతకుముందెవ్వరూ ఊహించనిది. కాబట్టి, ఇంకా మీరు కూర్చుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. కదలండి. మీ సృజనకు రంగులు అద్దండి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచండి. తద్వారా, ఆదాయమూ పెంపొందించుకోండి. సాధారణ ఆలోచనలకు సృజనాత్మతను జోడించి అద్భుతాలు సృష్టించండి.

బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?

Read more about: india money
English summary

ఇండియాలో రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించడమెలా? | How to Earn Rs 1000 per Day in India?

With the changing lifestyles in accordance with the advancing technology, life is becoming more challenging. There is a cut throat competition in job searching, even when most jobs pay way less than the hardship they require. Prices are reaching for the notch and there is not much increment of incomes! With respect to the current economy, ‘How to earn more money‘ is one question that tinkers every mind
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X