ఇంటి అద్దెకు సంబంధించి ప‌న్ను మిన‌హాయింపులో ఇలా చేయండి

ఎక్కువ మంది ఇంటి అద్దెకు సంబంధించి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని అనుకుంటారు. ల‌క్ష పైన ఏడాది అద్దె చెల్లిస్తున్న‌ట్ల‌యితే ఓన‌ర్ పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సిందే. లేక‌పోతే మీ వేత‌న

న‌గ‌రాల్లో సొంత ఇల్లు ఉండే వారు త‌క్కువ‌. ఎక్కువ శాతం మంది అద్దె ఇళ్ల‌లోనే కాలం వెళ్ల‌దీస్తుంటారు. సంపాద‌న‌లో 30 నుంచి 40 శాతం ఆదాయాన్ని ఇంటి అద్దెకే వెచ్చించేవారు లేక‌పోలేదు. కాబట్టి ఎక్కువ మంది ఇంటి అద్దెకు సంబంధించి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని అనుకుంటారు. ల‌క్ష పైన ఏడాది అద్దె చెల్లిస్తున్న‌ట్ల‌యితే ఓన‌ర్ పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సిందే. లేక‌పోతే మీ వేత‌నం నుంచి టీడీఎస్ మిన‌హాయిస్తారు. కాబ‌ట్టి ఈ ప‌న్ను మిన‌హాయింపుకు ఓన‌ర్ పాన్ ఉంటే ఎలా, ఓన‌ర్ పాన్ లేక‌పోతే ఎలా ప‌న్ను మిన‌హాయింపు సౌక‌ర్యాన్ని పొందొచ్చో తెలుసుకుందాం.

1. యాజ‌మాని పాన్ నంబ‌రు లేకుండానే హెచ్ఆర్ఏ మిన‌హాయింపు క్లెయిం చేసుకోవ‌చ్చా?

1. యాజ‌మాని పాన్ నంబ‌రు లేకుండానే హెచ్ఆర్ఏ మిన‌హాయింపు క్లెయిం చేసుకోవ‌చ్చా?

టీడీఎస్ భారాన్ని త‌గ్గించుకొనే క్ర‌మంలో ప‌న్ను మిన‌హాయింపు కోసం పెట్టుబ‌డి చేసిన‌ట్టు ఆధారాలను సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతాం. ఇందులో భాగంగా అద్దెకు నివ‌సించేవారుంటే యాజ‌మాని వ‌ద్ద నుంచి పాన్ సంఖ్య తెలుసుకొని క్లెయిం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అయితే ఇక్క‌డ య‌జ‌మాని త‌న పాన్ వివ‌రాలు ఇవ్వ‌డానికి స‌సేమిరా అంటాడు.

ఈ నేప‌థ్యంలో మీరొక వేళ ఉద్యోగులైతే హౌజ్ రెంట్ అల‌వెన్స్‌(హెచ్ఆర్ఏ) పొందుతున్న‌ట్ట‌యితే ... ఇంటిని అద్దెకు తీసుకొని ఏడాదికి రూ.1లక్ష ఆ పైన కిరాయి చెల్లిస్తున్న‌ట్టయితే అద్దె ర‌శీదుల‌తో పాటు ఇంటి ఓన‌రు పాన్ వివ‌రాలు కూడా మీరు ప‌నిచేసే సంస్థ‌కు అందించవ‌లసి ఉంటుంది. మీ సంస్థ దీన్ని అందుకోక‌పోతే హెచ్ఆర్ఏ ప్ర‌యోజ‌నాలు టీడీఎస్‌లో ప్ర‌తిబింబించ‌దు.

2. ఇంటి యాజ‌మాని నుంచి పాన్ పొంద‌లేక‌పోతే?

2. ఇంటి యాజ‌మాని నుంచి పాన్ పొంద‌లేక‌పోతే?

ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేసేట‌ప్పుడు హెచ్ఆర్ఏ పైన ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. దీని కోసం ఇంటి యాజ‌మాని పాన్ సంఖ్య త‌ప్ప‌నిస‌రేమీ కాదు. ఐతే ఫారం 26AS ప్ర‌కారం వేత‌న ఆదాయానికి, సొంతంగా రిట‌ర్నుల దాఖ‌లులో ఉండే ఆదాయానికి మ‌ధ్య‌ తేడాలుంటే మాత్రం ఐటీ శాఖ నుంచి నోటీసు వ‌స్తుంది. ఇలాంటి సంద‌ర్భంలో క్లెయింల‌ను స‌ఫ‌లం చేసుకునేందుకు రెంట‌ల్ అగ్రిమెంట్‌, అద్దె ర‌శీదులు, అద్దె చెల్లించిన‌ట్టుగా బ్యాంక్ స్టేట్‌మెంట్లు లాంటి వాటితో సిద్ధంగా ఉండాలి.

 3. త‌ల్లిదండ్రులు లేదా పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చా?

3. త‌ల్లిదండ్రులు లేదా పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చా?

మీ పిల్ల‌లకు లేదా త‌ల్లిదండ్రుల‌కు ఇంటి అద్దె చెల్లిస్తూ ఉంటే చ‌ట్ట‌బ‌ద్ధంగా హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే జీవిత‌భాగ‌స్వామికి ఇది వ‌ర్తించ‌దు. అద్దెను ఎవ‌రికైతే చెల్లిస్తామో వారు ఆ ఇంటికి చ‌ట్ట‌బ‌ద్ధంగా యాజ‌మానులై ఉండాలి. అద్దె చెల్లిస్తున్న‌ట్టుగా ర‌శీదుల రూపంలో లేదా బ్యాంకు ద్వారా న‌గ‌దు బ‌దిలీ రూపాల్లో సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది.

4. గృహ‌రుణ అస‌లు, వ‌డ్డీపై భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చా?

4. గృహ‌రుణ అస‌లు, వ‌డ్డీపై భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చా?

భార్యా భ‌ర్త‌లిద్ద‌రి పేరు మీద ఇల్లు ఉంటే అప్పుడు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఇద్ద‌రు స‌హ భాగ‌స్వాములు చెరొక రూ.2ల‌క్ష‌ల దాకా వ‌డ్డీ చెల్లింపుల‌పై సెక్ష‌న్ 24 (b) కింద ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. అలాగే అస‌లు చెల్లింపుపై సెక్ష‌న్ 80సీ కింద చెరొక‌రు రూ.1.5ల‌క్ష‌ల చొప్పున ప‌న్ను మిన‌హాయింపు పొందే వీలుంది. ఇల్లు ఒక్క‌రి పేరిటే ఉంటే ఇద్ద‌రూ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొంద‌లేరు.

5. న‌కిలీ అద్దె ర‌శీదులు స‌మ‌ర్పించ‌వ‌చ్చా?

5. న‌కిలీ అద్దె ర‌శీదులు స‌మ‌ర్పించ‌వ‌చ్చా?

ఇంటి యాజ‌మాని అద్దె ర‌శీదులు ఇవ్వ‌న‌ప్పుడు సాధార‌ణంగా కిరాయిదారులు చేసే ప‌ని న‌కిలీ ర‌శీదులు స‌మ‌ర్పించ‌డం. ఐటీ శాఖ‌వారు మ‌నం ప‌నిచేసే సంస్థ‌కు వ‌చ్చి ఈ విష‌య‌మై త‌నిఖీ చేయ‌ర‌నే భావ‌న‌తోనే ఉంటాం. ఒక వేళ మీరు అద్దెకున్న ఇంటి యాజ‌మాని కేవ‌లం న‌గ‌దునే అంగీక‌రిస్తూ, పాన్ సంఖ్య‌ను ఇవ్వ‌క‌పోతే ఫ‌లితంగా మీరు న‌కిలీ రశీదులు పెట్టేందుకే మొగ్గుచూపిస్తారు.

మ‌ళ్లీ మీ ప్ర‌శ్న వ‌ద్ద‌కు వ‌స్తే న‌కిలీ ర‌శీదులు స‌మ‌ర్పించ‌డ‌మ‌న్న‌ది త‌ప్పు. ఇటీ శాఖ వారి త‌నిఖీలో బ‌య‌ట‌ప‌డే ప్ర‌మాద‌ముంది. ఇంటి అద్దెను న‌గ‌దు రూపంలో చెల్లిస్తున్న‌ట్టుగా కేసు దాఖ‌లు చేయ‌డ‌మో లేదా బ్యాంకులో జ‌మచేస్తున్న‌ట్టుగా ఐటీఆర్ ఫారంలో పేర్కొనాలి. ఇంత కంటే మంచి మార్గం చెప్పాలంటే రెంట‌ల్ అగ్రిమెంట్ మీద సంత‌కం చేసేట‌ప్పుడే అద్దె చెల్లింపులు ఏ ర‌కంగా చెయ్యాల‌న్న‌ది చ‌ర్చించాలి.

6. ఐటీ శాఖ ఎప్పుడెప్పుడు త‌నిఖీలు నిర్వ‌హిస్తుంది?

6. ఐటీ శాఖ ఎప్పుడెప్పుడు త‌నిఖీలు నిర్వ‌హిస్తుంది?

* గృహ‌రుణంతో పాటుగా హెచ్ఆర్ఏ ను క్లెయిం చేసుకున్న సంద‌ర్భంలో ఐటీ శాఖ‌ త‌నిఖీ నిర్వ‌హిస్తుంది.

* ఒక వేళ ఉద్యోగ నిమిత్తం వేరే న‌గ‌రంలో ఉండి అక్క‌డ స‌మీపంలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటే, మ‌రో వైపు సొంతూరులో ఉన్న ఇంటికి గృహ‌రుణం చెల్లిస్తున్న‌ట్ట‌యితే రెండింటికీ ప‌న్ను మిన‌హాయింపు కోసం క్లెయిం చేసుకోవ‌చ్చు.

* మీరు వాస్త‌వంగా చెల్లించే అద్దెకంటే ఎక్కువ‌గా ర‌శీదుల్లో చూపించిన‌ట్టు అనుమానం వ‌స్తే ఐటీ శాఖ త‌నిఖీ చేస్తుంది.

* త‌ల్లిదండ్రులు లేదా పిల్ల‌ల‌తో ఉండి అద్దె చెల్లించ‌క‌పోయినా.. హెచ్ఆర్ఏ క్లెయిం కోసం అద్దె చెల్లిస్తున్న‌ట్టు న‌కిలీ సాక్ష్యాల‌ను సృష్టిస్తే అప్పుడు ఐటీ శాఖ సోదాలు నిర్వ‌హిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+