NEFT, RTGS, IMPS ల గురించి మీరు వినే ఉంటారు. వీటి ద్వారా నగదును కూడా బదిలీచేస్తునే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాతే వీటి గురించి జనాలకు బాగా తెలిసొచ్చింది. డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా వీటిని
NEFT, RTGS, IMPS ల గురించి మీరు వినే ఉంటారు. వీటి ద్వారా నగదును కూడా బదిలీచేస్తునే ఉంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాతే వీటి గురించి జనాలకు బాగా తెలిసొచ్చింది. డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఇంకా కొందరికి ఇవేమిటో, ఎలా పనిచేస్తాయో తెలియకపోవచ్చు. అలాంటి వారికోసమే కాకుండా వీటి మధ్య బేధాలేమిటో తెలుసుకోవాలనుకునేవారికోసమే ఈ కథనం.

1. NEFT:
- నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేసేందుకు దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన విధానమిది. వ్యక్తులు, సంస్థలు,కార్పొరేట్ సంస్థలు ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా నెఫ్ట్ ద్వారా నగదు బదిలీచేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా లేనివారు స్వయంగా శాఖకు వెళ్లి నగదును డిపాజిట్ చేయవచ్చు. అక్కడి సిబ్బంది నెఫ్ట్ ద్వారానే లబ్ధిదారుని ఖాతాలో డబ్బు జమచేస్తారు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇలాంటి లావాదేవీలకు గరిష్ఠంగా రూ.50వేల వరకే పరిమితి ఉంది.
- ఆన్‌లైన్‌లో నెఫ్ట్ ద్వారా నగదు బదిలీ చేసుకునేందుకు కనీస, గరిష్ట పరిమితులంటూ లేవు.
- అయితే ఒక్కసారికి మాత్రం గరిష్టంగా రూ.50వేల వరకు పంపుకునే అనుమతి ఉంది.
- అది భారత్ లో ఇంకా నేపాల్‌లో.
- ఎవరి ఖాతాలో అయితే నగదు జమచేయాలనుకున్నామో వారి ఖాతాలోకి అదే రోజు డబ్బు జమ అవుతుంది లేదా సాయంత్రం చివరి బ్యాచ్లో బదిలీ చేస్తే ఒక్కోసారి మరుసటి రోజు జమ అవుతుంది.

2. RTGS:
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్. నగదు బదిలీలను వాస్తవ సమయంలో ఇండివిడ్యువల్‌గా చేసే విధానం ఇది. రియల్ టైమ్ అంటే బ్యాంకు వాళ్లు ఇచ్చే సూచనలను అప్పటికప్పుడే పాటించాల్సిన వాస్తవ సమయం. గ్రాస్ సెటిల్‌మెంట్ అంటే నగదు బదిలీ ఇండివిడ్యువల్‌గా అవుతుంది. ఈ విధానం ద్వారా చేసే నగదు సెటిల్‌మెంట్లు తుదిగా, తిరిగి రికవర్ చేయలేనిదిగా పరిగణిస్తారు. పెద్ద పెద్ద లావాదేవీలకు ఈ విధానం ఉద్దేశించింది. కనీసం రూ.2లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటేనే ఈ విధానాన్ని ఉపయోగించాలి. సాధారణ పరిస్థితుల్లో బ్యాంకు శాఖ అప్పటికప్పుడే డబ్బు అందుకుంటుంది. దాన్ని అర గంటలో ఖాతాదారుకు బదిలీ చేయాల్సిన బాధ్యత బ్యాంకుది.

3. నెఫ్ట్- ఆర్టీజీఎస్‌లకు తేడా...
నెఫ్ట్ విధానం డెఫర్డ్ నెట్ సెటిల్‌మెంట్ (డీఎన్ఎస్) విధానంలో పనిచేస్తుంది. అంటే బ్యాచ్‌లవారీగా లావాదేవీలు జరుగుతాయి. ఈ విధానంలో లావాదేవీలు ఒక నిర్ణీత కట్ ఆఫ్ సమయం వరకు జరుగుతాయి. ఆ తర్వాత అందుకునేవన్నీ మరుసటి బ్యాచ్‌నకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ బ్యాచ్లు గంటకోసారి ఉంటుంది. ఆర్టీజీఎస్ పనివేళల్లో తక్షణమే నగదు బదిలీ అవుతుంది. ఇక్కడ బ్యాచ్‌లలాంటివేవీ ఉండవు.

4. IMPS:
ఐఎంపీఎస్ అంటే ఇమ్మిడీయట్ పేమెంట్ సర్వీసు.. దీన్ని పూర్తి పేరు. 24 గంటలు ఈ విధానం పనిచేస్తూనే ఉంటుంది. ఈ సేవను జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) అందిస్తుంది. వినియోగదారులు బ్యాంకులు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ఇష్యూయర్స్(పీపీఐ) ల ద్వారా ఏ ఖాతాకైనా తక్షణమే నగదు బదిలీ చేయవచ్చు.
ఐఎమ్‌పీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి...
1) తక్షణ బదిలీ
2) సెలవుల్లోనూ పనిచేస్తుంది. రోజులో 24 గంటలు ఈ సేవను ఉపయోగించవచ్చు.
3) సురక్షితమైనది, భద్రత కలిగినది. సులువుగా వాడుకోవచ్చు, తక్కువ ఛార్జీలు
4) మొబైల్, ఇంటర్నెనట్, ఏటీఎమ్‌ల ద్వారా బదిలీ చేసుకునే సౌకర్యం.
5) ఎస్ఎంఎస్ ద్వారా నగదు జమ, బదిలీపై సమాచారం అందుతుంది.
ఐఎమ్‌పీఎస్‌పై ఛార్జీలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలే నిర్ణయిస్తాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications