దేశంలో ట్రేడింగ్ ఖాతా తెరిచే విధానం
రిటైల్ ట్రేడర్లు ఏదైనా ఆర్థిక సంస్థ లేదా బ్రోకర్ల వద్ద తమ ట్రేడింగ్ ఖాతాను తెరవచ్చు. మీరు నిత్యం సాఫీగా ట్రేడింగ్ చేయాలంటే ట్రేడింగ్ ఖాతా ఎలా తెరవాలో ఇక్కడ తెలుసుకుందాం
2000 సంవత్సరం నుంచి స్టాక్ మార్కెట్లు మొత్తం డిజిటల్ మయం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి స్టాక్‌మార్కెట్లో ఆన్‌లైన్ లావాదేవీలు జరపాలంటే ట్రేడర్లు స్టాక్ ఎక్స్చేంజీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఇక రిటైల్ ట్రేడర్లు ఏదైనా ఆర్థిక సంస్థ లేదా బ్రోకర్ల వద్ద తమ ట్రేడింగ్ ఖాతాను తెరవచ్చు. మీరు నిత్యం సాఫీగా ట్రేడింగ్ చేయాలంటే ట్రేడింగ్ ఖాతా ఎలా తెరవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1. బ్రోకరు ఎంపిక
ముందు ఒక బ్రోకర్‌ను లేదా ఒక సంస్థను ఎంచుకోవాలి.
ఆ బ్రోకర్ నమ్మకస్థుడా, మీ ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తాడో లేదో తెలుసుకోవాలి.
స్టాక్ మార్కెట్లో క్షణం కూడా ఎంతో విలువైనదని గుర్తుంచుకోండి.
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సయంలో మీ షేర్ విలువ మారిపోవడానికి ఒక నిమిషం చాలు.
అందుకే మొదటే ఆచితూచి మంచి బ్రోకర్ని ఎంచుకోవడం ఎంతో అవసరం.

2. బ్రోకరేజీ ఫీజు
బ్రోకరేజీ ధరలను పోల్చి చూసుకోండి. ప్రతి బ్రోకరు మీ ఆదేశాలను కార్యాచరణలో పెట్టడానికి ఫీజు రూపంలో కొంత మొత్తం రుసుమును వసూలు చేస్తారు. కొంత మంది ఎక్కువ తీసుకుంటారు, కొంత మంది తక్కువ తీసుకుంటారు.
మీరు చేసే ట్రేడింగ్‌ను బట్టి ఈ రుసుముల్లో రాయితీ సైతం కల్పిస్తారు.
మీరు ఖాతా తెరిచే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మంచిది.

3. బ్రోకరేజీ సేవలను పోల్చి చూసుకోండి
తక్కువ ఫీజు ఉందని ఏదో బ్రోకరేజీని ఎంచుకోవాల్సి అవసరం లేదు.
మంచి బ్రోకరేజీ సేవలు అందించే వారు సాధారణంగా అందరూ తీసుకునేదాని కంటే ఎక్కువ తీసుకోవచ్చు.
కాబట్టి మంచి బ్రోకర్ కోసం కాస్త ఎక్కువ రుసుములు చెల్లించేందుకు సైతం వెనుకాడవద్దు.

4. ప్రక్రియ గురించి తెలుసుకోండి
ఇప్పుడు బ్రోకరేజీ సంస్థ కానీ బ్రోకర్‌ని కానీ కలిసి ఖాతా తెరిచే పద్దతిని గురించి అడగండి.
సాధారణంగా సంస్థ తమ ప్రతినిధిని ఖాతా తెరిచేందుకు ఫారం, know your client(కేవైసీ) ఫారంతో మీ ఇంటికి పంపుతారు.

5. ఖాతా తెరిచే ఫారాన్ని నింపండి
ఈ రెండు ఫారాల్ని వీలైనంత త్వరగా నింపండి. వీటితో పాటు మీ వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను పంపాలి.
మీ దరఖాస్తును స్వయంగా కానీ లేదా ఫోనులో కానీ ధ్రువీకరించుకుంటారు.
దీనికి మీ వ్యక్తిగత వివరాలను అడుగుతూ క్రాస్ చెక్ చేస్తారు.

6. ట్రేడింగ్ ప్రారంభించవచ్చు
ప్రాసెస్ అంతా ఆటంకం లేకుండా పూర్తైతే, మీకు ట్రేడింగ్ ఖాతా వివరాలిస్తారు.
దీంతో ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఏ ఇబ్బంది లేకుండా ట్రేడింగ్‌ను మొదలుపెట్టవచ్చు.

7. అవసరమైన పత్రాలు
డీమ్యాట్ ఖాతా తెరవడానికి ఎలాగో, దీనికి కూడా వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలు కావాలి.
ఇంకా పాస్ పోర్టు ఫోటో, మీ ఆర్థిక వివరాలు, వ్యక్తిగత వివరాలు కొన్ని అవసరం అవుతాయి.
ట్రేడింగ్ ఖాతా తెరవడానికి ఖాతా తెరిచే దరఖాస్తు ఫారం కావాల్సి ఉంటుంది.

8. వ్యక్తిగత గుర్తింపు పత్రాలు
గుర్తింపు కోసం పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు ధ్రువీకరణ, ఆదాయపు పన్ను రిటర్నులు, కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు వంటివి ఇవ్వవచ్చు.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా వీరి విభాగాల ద్వారా లేదా చట్టబద్ధమైన లేదా నియంత్రణ అధికారులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా ప్రజా ఆర్థిక సంస్థల లేదా విశ్వవిద్యాలయాల ద్వారా గుర్తింపబడిన కాలేజీల ద్వారా లేదా ఐసీఏఐ, ఐసీడబ్లుఏఐ, ఐసీఎస్ఐ, బార్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా దరఖాస్తుదారుని ఫోటోతో జారీచేయబడిన గుర్తింపు కార్డు

9. చిరునామా గుర్తింపు కోసం
రేషన్ కార్డు, పాస్ పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు,డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు పాస్ పుస్తకం లేదా స్టేట్ మెంట్,
మీ పేరుతో ఉన్న కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, లీజు లేదా లైసెన్స్ అగ్రిమెంటు లేదా సేల్ అగ్రిమెంట్
హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీల ద్వారా స్వీయ ధ్రువీకరణ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా వీరి విభాగాల ద్వారా లేదా చట్టబద్ధమైన/ నియంత్రణపరమైన అధికారులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకులు లేదా ప్రజా ఆర్థిక సంస్థల ద్వారా, విశ్వవిద్యాలయాల ద్వారా గుర్తింపు పొందిన కళాశాలల గుర్తింపు కార్డులు, లేదా ఐసీఏఐ, ఐసీడబ్లుఏఐ, ఐసీఎస్ఐ, బార్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా జారీచేయబడిన గుర్తింపు కార్డు లేదా చిరునామా పత్రాలు ఏవైనా సమర్పించవచ్చు.


Click it and Unblock the Notifications