పాన్ కార్డుతో మ‌న‌కు ప‌నేముంది?

పాన్‌కార్డు ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ వద్దు..? అన్న విషయంలో తికమక పడుతుంటారు. కొంత మందికి పాన్‌కార్డు గురించి అసలే తెలియదు. అసలు ఎలా తీసుకోవాలి? దాని ఉపయోగాలు ఏమిటి? తెలుసుకుందాం.

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మందికి పాన్ కార్డు అవసరం పెరిగింది. ఆదాయ పన్ను శాఖ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి 10 ఉంటాయి. చాలా మంది పాన్‌కార్డు ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ వద్దు..? అన్న విషయంలో తికమక పడుతుంటారు. కొంత మందికి పాన్‌కార్డు గురించి అసలే తెలియదు. అసలు ఎలా తీసుకోవాలి? దాని ఉపయోగాలు ఏమిటి? తెలుసుకుందాం.

ఆదాయ పన్ను

ఆదాయ పన్ను

రిటర్న్ సమర్పించేటప్పుడు ఎవరెవరికీ..?

* ఆదాయ పన్ను చెల్లించే వారందరికీ, ఇతరుల తరఫున ఆదాయ పన్ను రిటర్స్ చేసే వారికి..

* విధిగా పాన్ నంబర్ నమోదు చేయాల్సిన లావాదేవీలతో కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి తప్పని సరైంది.

* బ్యాంకు ఖాతాకు పాన్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం మీకు తెలిసే ఉంటుంది.

దరఖాస్తు ఇలా..

దరఖాస్తు ఇలా..

పాన్‌కార్డుకు సంబంధించిన సేవలను మెరుగుపర్చడం కోసం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఉన్న ప్రతి పట్టణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాలు ఉంటాయి. వీటిని యూటీఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు ఆ శాఖ అనుమతించింది. పెద్ద నగరాల్లో పాన్ దరఖాస్తుదారుల కోసం ఇప్పటి కన్నా ఎక్కువ ఐటీ పాన్ సర్వీస్ కేంద్రాలు ఉంటాయి. వీటితో పాటు స్పెషలిటేషన్ కేంద్రాల్లోనూ పాన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పాన్ కార్డు కోసం పాస్‌పోర్టుసైజు కలర్ ఫొటోతో పాటు వ్యక్తి గత గుర్తింపు పత్రం, చిరునామా, పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, పాస్‌పోర్టు, పదో తరగతి మెమో, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా మీ దగ్గరలో ఏదైనా ఒకటి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. 15 రోజుల తర్వాత పోస్టులో ఇంటికి పాన్‌కార్డు వస్తుంది.

పాన్ కార్డు ద‌ర‌ఖాస్తు రుసుము జులై 1,2017 నుంచి రూ.110(భార‌త‌దేశం ఆవ‌ల‌, విదేశాల్లో డిస్పాచ్ కావాలంంటే రూ.1020)

ఎప్పుడు అవసరమంటే..

ఎప్పుడు అవసరమంటే..

* రూ. 50వేల పైబడి బ్యాంకు డిపాజిట్ల సమయంలో..

* బ్యాంకు ఖాతా తెరిచేందుకు..

* టీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరువడానికి..

* చెక్కులు, డీడీల లావాదేవీలు రూ. 50వేలను మించితే..

* స్థిరాస్తి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు జరిపేటప్పుడు..

* హోటళ్లు, విలాసాలు, బయానా ఖర్చుల వంటి వాటి కోసం రూ.20వేల కంటే నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు.

ఎక్కడినుంచైనా ఫారం 49 ఏ లో, పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునా?

ఎక్కడినుంచైనా ఫారం 49 ఏ లో, పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునా?

అవును. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ల నుంచి, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లనుంచి కాకుండా, ఇతరత్రా ఎక్కడినుంచైనా పొందే ఫారం 49 ఏ లో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్ నుంచి, లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్, లేదా ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న, లేదా స్థానికం గా ముద్రించిన, లేదా జిరాక్స్ చేసిన దరఖాస్తు పత్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

5. పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చునా?

5. పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చునా?

అవును, కొత్తగా పాన్ కేటాయింపు కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇంతేకాకుండా, పాన్ సమాచారంలో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా, కొత్త పాన్‌కార్డు పొందాలనుకున్నా (పాన్ వుండి కార్డు మాత్రమే కొత్తది పొందడం), ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (మరిన్ని వివరాలకోసం (www. tin-nsdl. com) వెబ్ సైట్ లో చూడండి).

ఆన్లైన్ పాన్ దర‌ఖాస్తు కొర‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

www.onlineservices.nsdl.com

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+