11 లక్షల పాన్ కార్డుల రద్దు: మీ కార్డ్ స్టేటస్ తెలుసుకోండిలా...
అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ పాన్ నెంబర్ పని చేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి
దేశ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పాన్‌కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఆదాయపన్ను శాధికారులు కొంత కాలంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజా నివేదికల ప్రకారం జులై 27 నాటికి దేశ వ్యాప్తంగా 11,44,211 నకిలీ పాన్ కార్డులను రద్దు చేసినట్టుగా సమాచారం. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ పాన్ నెంబర్ పని చేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి

1. ఇన్‌కమ్ ట్యాక్స్ ఈఫైలింగ్ వెబ్‌సైట్ http://www.incometaxindiaefiling.gov.in కు వెళ్లండి.
2. అందులో ఎడమ పక్కన కింద Know Your PAN అనే ఆప్షన్‌ను నొక్కండి.
3. ఇక్కడ వెబ్‌సైట్ కొన్ని వివరాలు అడుగుతుంది. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు కావాలి.
తర్వాత మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
4. మీ నమోదిత మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే అది తర్వాతి పేజీకి వెళుతుంది.
వాలిడేట్ అనే బటన్ నొక్కండి.
5. మీ పాన్ కార్డు పనిచేస్తున్నట్లయితే యాక్టివ్ అనే స్టేటస్ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications