ఏప్రిల్ 1 నుంచి ప‌న్ను రిట‌ర్నుల ఫైలింగ్ సులువుగా

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో జ‌రిగిన రూ.2 ల‌క్ష‌ల‌కు పైబ‌డిన డిపాజిట్ల వివ‌రాలు ఇవ్వాలి. త‌క్కువ ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధి క‌లిగిన వారికి ఒకే పేజీ రిట‌ర్నుల‌ను ఐటీ శాఖ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో కొత్త ఆర్థి

ఏప్రిల్ 1 నుంచి వివిధ ప‌న్ను చెల్లింపుదార్లు చేసే ప‌న్ను రిట‌ర్నుల్లో ఆదాయపు ప‌న్ను శాఖ కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు అంద‌రూ త‌ప్ప‌కుండా ఆధార్ సంఖ్య‌ను ఇవ్వాలి. అంతే కాకుండా నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో జ‌రిగిన రూ.2 ల‌క్ష‌ల‌కు పైబ‌డిన డిపాజిట్ల వివ‌రాలు ఇవ్వాలి. త‌క్కువ ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధి క‌లిగిన వారికి ఒకే పేజీ రిట‌ర్నుల‌ను ఐటీ శాఖ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో కొత్త ఆర్థిక సంవత్స‌రం రిట‌ర్నుల‌కు సంబంధించిన కీల‌క మార్పుల‌ను తెలుసుకుందాం.

ఐటీఆర్‌-1 వాళ్ల‌కే ఒకే పేజీ

ఐటీఆర్‌-1 వాళ్ల‌కే ఒకే పేజీ

ఐటీఆర్‌-1 ఫైలింగ్ సౌక‌ర్యం ఏప్రిల్ 1 నుంచి జులై 31 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. ఇప్ప‌టిదాకా స‌హ‌జ్‌(ఐటీఆర్‌1) ఫారంను వేత‌న ఉద్యోగులు, ఐటీఆర్‌2ను వ్యాపార ఆదాయం లేని ఇత‌రులు ఉప‌యోగిస్తున్నారు. ఏప్రిల్ 1 త‌ర్వాత నుంచి ఐటీఆర్ 2ఏను ప్ర‌భుత్వం తొల‌గించింది.

జులై 1 తర్వాత నుంచి ఆధార్ త‌ప్ప‌నిస‌రి

జులై 1 తర్వాత నుంచి ఆధార్ త‌ప్ప‌నిస‌రి

ఫైనాన్స్ బిల్లు,2017కు చేసిన స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం జులై1 త‌ర్వాత ప‌న్ను మ‌దింపుదార్లంతా త‌ప్ప‌కుండా ఐటీఆర్ ఫారంల్లో ఆధార్ వివ‌రాలు ఇవ్వాల్సిందే.

ఇప్ప‌టికే స‌హ‌జ్ ఫారంలో ఈ మేర‌కు మార్పులు చేశారు.

ఐటీఆర్‌-4 ఎప్పుడు?

ఐటీఆర్‌-4 ఎప్పుడు?

ఏదైనా సంస్థ‌లో భాగ‌స్వామిగా ఉంటూ మీకు ప్ర‌త్యేకంగా ఆదాయం వ‌స్తూ ఉంటే ఇదివ‌ర‌కూ ఐటీఆర్‌-4 ఫారంను ఉప‌యోగించాలి. వృత్తిప‌ర‌మైన ప్ర‌త్యేక ఆదాయం వ‌చ్చేవారు సైతం దీన్నే వాడేవారు. వీరంతా సుగ‌మ్ పేరుతో ఉండే ఐటీఆర్‌-4Sను ఉప‌యోగించి రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించాలి.

ఫైలింగ్ ఫారంల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

పేపర్ ఫార్మాట్‌లో

పేపర్ ఫార్మాట్‌లో

ఐటీఆర్‌-1(స‌హ‌జ్‌) లేదా ఐటీఆర్‌-4(సుగ‌మ్‌) రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించిన‌వారిలో 80 ఏళ్ల‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారు, రూ. 5 ల‌క్ష‌ల‌కు మించ‌ని ఆదాయం క‌లిగిన వారికి ఒక స‌దుపాయం క‌ల్పించారు. వీరంతా పేప‌ర్ ఫారంలో రిట‌ర్నులను ఫైల్ చేయ‌వ‌చ్చు. ఎవ‌రైతే రీఫండ్ల‌ను క్లెయిం చేయ‌డం లేదో వారు సైతం పేప‌ర్ ఫార్మాట్‌లో రిట‌ర్నుల‌ను స‌బ్‌మిట్ చేయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+