బేసిక్ ఫీచర్ ఫోన్లను మొదలుకొని ఖరీదైన స్మార్ట్ ఫోన్ల వరకూ నెట్ ఉన్నా లేకపోయినా బ్యాంక్ సేవలను పొందడం ఇందులో ప్రత్యేకత. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అభివృద
ప్రస్తుతం ప్రపంచమంతా ఆధునిక సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ, నిరక్షరాస్యుల్లో బ్యాంకింగ్ తగినంత చొచ్చుకోలేకపోయింది. అందుకే ఆర్‌బీఐ నేతృత్వంలోని ఎన్‌పీసీఐ బ్యాంకింగ్‌ను సులభతర చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను వినియోగదారుల ముందుకు తీసుకొస్తోంది. ఇదే కోవలో *99# బ్యాకింగ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ లేకుండానే సాధారణ మొబైల్‌లో బ్యాంకింగ్ కార్యకలపాలను నిర్వహించుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లనవసం లేకుండా కొన్ని ప్రాథమిక సేవలను చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే పొందవచ్చు. దీని గురించి మరిన్న వివరాలు తెలుసుకుందాం.

నెట్ లేకున్నా ఫర్వాలేదు
ఆర్‌బీఐ కృషి కారణంగా సాధారణ మొబైల్ ఫోన్ వాడే వారికి కూడా యూఎస్ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాకింగ్ సేవ అందుబాటులో ఉంది. బేసిక్ ఫీచర్ ఫోన్లను మొదలుకొని ఖరీదైన స్మార్ట్ ఫోన్ల వరకూ నెట్ ఉన్నా లేకపోయినా బ్యాంక్ సేవలను పొందడం ఇందులో ప్రత్యేకత. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అభివృద్ది చేశారు. జీఎస్ఎం నెట్వర్క్ చానల్స్ ద్వారా ఈ టెక్నాలజీ వాడటానికి వీలు కలుగుతుంది. దీనికి సంబంధించిన షార్ట్ కోడ్లను మొబైల్ కీప్యాడ్‌లో ఎంచుకోవడం ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఒక్కో భాషలో సేవల కోసం ఒక్కో ప్రత్యేకమైన కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఏయే బ్యాంకులు
దాదాపు అన్ని ప్రయివేటు బ్యాంకులు, 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లకు బ్యాంకింగ్‌ను సులభతరం చేశాయి. బ్యాంకుల వైపు నుంచి చూస్తే ఏ విధమైన రుసుములు ఉండవు. కానీ మొబైల్ నెట్‌వర్క్ ఉపయోగించుకున్నందుకు గాను టెలికాం సంస్థలు ఒక్కో సంక్షిప్త సందేశానికి రూ. 1.50 వరకూ చార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఫోన్ కీప్యాడ్ షార్ట్ కోడ్స్
సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించాలంటే నెట్ అవసరం ఉంటుంది. మీకు ఈ కోడ్‌లు తెలిస్తే నెట్ లేకుండానే ఏ ఫోన్లో అయినా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు.
తెలుగులో సేవల కొరకు- *99*24#
తమిళం కొరకు (*99*23#),
హిందీ కొరకు (*99*22#),
మరాఠీ కొరకు(*99*28#),
బెంగాలీ కొరకు(*99*29#),
పంజాబీ కొరకు (*99*30#),
కన్నడ కొరకు (*99*26#),
గుజరాతీ కొరకు (*99*27#),
మళయాళం కొరకు (*99*25#),
ఒరియా కొరకు (*99*32#),
అస్సామీస్ కొరకు(*99*31#)

యూఎస్ఎస్‌డీలో పొందగలిగే సేవలు
మొదట మొబైల్‌లో మనకు ల్యాంగేజీ కోడ్ తెలిస్తే నేరుగా దాన్నే నొక్కవచ్చు. లేకపోతే
*99# నొక్కడం ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియను నెట్ లేకుండానే ప్రారంభించవచ్చు.
ఈ యూఎస్ఎస్డీలో అందుబాటులో ఉండే సేవలు
నగదు నిల్వ తెలుసుకోవడం
మినీ స్టేట్‌మెంట్
నగదు బదిలీ_ఎంఎంఐడీ ద్వారా
నగదు బదిలీ_ఖాతా సంఖ్య ద్వారా
నగదు బదిలీ_ఆధార్ సంఖ్యతో
ఎంపిన్ జనరేషన్
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications