దేశంలో చాలా పనులకు మనకు గుర్తింపు కార్డు ఎంతగానో అవసరం పడుతుంది. ప్రస్తుతం మనిషి తన గుర్తింపుని నిరూపించుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం, ఆధ
దేశంలో చాలా పనులకు మనకు గుర్తింపు కార్డు ఎంతగానో అవసరం పడుతుంది. ప్రస్తుతం మనిషి తన గుర్తింపుని నిరూపించుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం, ఆధార్ కార్డు లాంటి వాటిని వాడుతున్నాడు. ఆయా గుర్తింపు కార్డులు లేకపోతే చాలా చోట్ల కష్టమవుతుంది. మన పనులు పూర్తికావు. ఇందులో ఆర్థిక వ్యవహరాలకు సంబంధించిన పాన్ కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలిసే ఉంటుంది. కొన్ని సార్లు అజాగ్రత్త కారణంగా పాన్ కార్డు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది పోతే కంగారు పడాల్సిన పనిలేదు. డూప్లికేట్ పాన్ కార్డు పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ కార్డు అనగా పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్. మీ పాన్ కార్డుని మీరు పొగొట్టుకున్నా లేదా మీ పాన్ కార్డు డామేజ్ అయిన మీరు మళ్లీ డూప్లికేట్ పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాలంలో చాలా వెబ్ సైట్స్ ఈ వెసులుబాటుని కల్పిస్తున్నాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా వెబ్ సైట్స్ నుండి ఆన్ లైన్‌లో పాన్ కార్డు అప్లికేషన్ ఫారంను ప్రింట్ అవుట్ తీసుకుని మీ క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించడమే.
డూప్లికేట్ పాన్ కార్డు కోసం రెండు పాస్ పోర్ట్ ఫోటో సైజు ఫోటోలతో పాటు గతంలో మీరు పాన్ కార్డు తీసుకున్న సమయంలో ఏ రుజువులు(ప్రూఫ్) సమర్పించారో దాన్నే మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డు డామేజ్ అయినట్లైతే పాన్ కార్డు నఖలు అవసరం. అదే మీరు గనుక మీ పాన్ కార్డుని పోగొట్టుకున్నట్లైతే గతంలో మీ వద్ద ఉన్న పాన్ కార్డు జిరాక్స్ కాపీ లేదా పోలీస్ స్టేషన్ నుండి ఎఫ్‌ఐఆర్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు డూప్లికేట్ పాన్ కార్డుకి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ పేరు మీద ఉన్న ఓటరు ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, వాటర్ బిల్, యుటిలిటీ బిల్లులు, డిపాజిటరీ ఖాతా ప్రకటన లాంటి వాటిల్లో ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరి. సుమారు 20 రోజుల్లో కొత్త పాన్ కార్డును జారీ చేస్తారు. మరింత సమాచారం కోసం https://nsdl.co.in/ వెబ్‌సైట్‌ని సంప్రదించండి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications

