ఈ యాప్‌లతో మీ ఫండ్ నిర్వహణ మరింత సులభం
వివిధ బ్రోక్లర, బ్యాంకుల నుంచి చాలా కంపెనీలకు చెందిన ఫండ్స్‌ను కొన్నారా? అయితే వాటిని నిర్వహించుకోవడం కష్టమే. అవన్నీ ఎలా రాణిస్తున్నాయనే అంశాన్ని గమనించడం రోజు వీలుకాకపోవచ్చు. ఈ నేపథ్యం
వివిధ బ్రోక్లర, బ్యాంకుల నుంచి చాలా కంపెనీలకు చెందిన ఫండ్స్‌ను కొన్నారా? అయితే వాటిని నిర్వహించుకోవడం కష్టమే. అవన్నీ ఎలా రాణిస్తున్నాయనే అంశాన్ని గమనించడం రోజు వీలుకాకపోవచ్చు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలను సులభంగా, సరళంగా, వేగంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారా? మీ కోసమే మార్కెట్‌లో ఒక సాంకేతిక పరిష్కారం ఉంది. ఒకసారి 'మైక్యామ్స్ మ్యూచువల్ ఫండ్' యాప్‌ను ఉపయోగించి చూడండి. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మైక్యాప్స్ యాప్ ఉపయోగాలు
* అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లను ఒకే చోటు నిర్వహించుకోవచ్చు. వివిధ రకాల అకౌంట్లు, లాగిన్ ఐడీలు, పిన్ కోడ్‌లు అవసరం లేదు.
* యాప్‌ను ఉపయోగించాలంటే మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* ఫోలియోలను క్రియేట్ చేసుకోవడం వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లతోపాటు సిప్(క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక)లను కూడా నిర్వహించొచ్చు.
పోర్ట్‌ఫోలియోను సులభంగా ట్రాక్ చేయవచ్చు. సమీక్షించుకోవచ్చు.
* ఫండ్ స్వంతదారు సమాచార భద్రతకు యాప్ భరోసానిస్తోంది. లావాదేవీలకు సంబంధించిన వివరాలేవీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం కావని పేర్కొంది.
ఇది కూడా చదవండి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మార్గాలు
దీనితో పాటు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ట్రాకర్(Indian Mutual Fund Tracker), మై ఫండ్స్-పోర్ట్‌ఫోలియో ట్రాకర్ (My Funds - Portfolio Tracker), కేట్రాక్(KTrack) వంటి యాప్‌లు కూడా మీ పనిని మరింత సులభం చేస్తాయి. ఈ యాప్‌లన్నీ మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేందుకు ఉపయోగపడుతాయి. అలా అని మీ సన్నిహితులతో పోలిస్తే మీ ఫండ్ రాబడి ఎలా ఉందో పోల్చుకుని ప్రతిసారి సంతోషపడటం, బాధపడటం చేయకూడదు. మీ ఫండ్ పనితీరును బేరీజు వేసుకుంటూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం మంచిది. ఈ యాప్‌లతో మీ ఫండ్ల నిర్వహణను మరింత సులభతరం చేసుకోండి.


Click it and Unblock the Notifications