మ్యూచువల్ ఫండ్స్ కేవైసీలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవడం ఎలా?
కేవైసీలో ఈ వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి పెట్టుబడిదారుడు ఛేంజ్ ఆఫ్ కేవైసీ ఫారంను నింపాలి. దీనిలో మారిన అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వాటిని పొందుపర్చాలి. మార్పు లేని వాటి స్థానంలో పాత
మ్యూచ్‌వల్‌ఫండ్స్ పెట్టుబడుల ప్రారంభ సమయంలో పెట్టుబడిదారుడు ఇచ్చిన వ్యక్తిగత వివరాల ఆధారంగానే ఫండ్‌హౌస్ పెట్టుబడిదారుడితో అనుక్షణం సంప్రదింపులు జరుపుతుంది. పెట్టుబడిదారుడికి సంబంధించిన ఈ వివరాల్లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే వాటిని వెంటనే సంబంధిత కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. లేని యెడల కంపెనీ నుంచి తన పెట్టుబడులకు సంబంధించి వచ్చే సమాచారం పెట్టుబడిదారుడు అందుకోలేడు. కావున వ్యక్తిగత వివరాల్లో మార్పులను వెంటనే కంపెనీకి తెలియజేయడం ముఖ్యం. చిరునామా, మొబైల్‌నెంబర్, మెయిల్ ఐడి వంటివి వ్యక్తిగత వివరాలుగా పరిగణిస్తాం. వీటితో పాటుగా కొన్నిమార్లు పెట్టుబడిదారుడి పేరు, పుట్టిన తేదీ వంటివి తప్పుగా నమోదు చేయబడుతుంటాయి. ఇలాంటి తప్పులను సరిచేసుకోవడానికి, పైన పేర్కొన్న వ్యక్తిగత వివరాల్లో మార్పులను తెలియజేయడానికి పెట్టుబడిదారుడు సంబంధిత మ్యూచ్‌వల్ ఫండ్ కంపెనీకి ఒక పర్సనల్ డిటైల్స్ అపడేట్ ఫారంను సంబంధిత ధృవీకరణ పత్రాలతో సమర్పించాలి. అయితే ఇలా తను పెట్టుబడి పెడుతున్న ప్రతి కంపెనీకి విడివిడిగా పత్రాలను సమర్పించడం శ్రమతో కూడుకున్న పని మరియు సమయం కూడా వృథా అవుతుంది. కావున పెట్టుబడిదారుడు తన కేవైసిలో ఈ వివరాలను అప్‌డేట్ చేసుకుంటే అక్కడినుంచి తను పెట్టుబడి పెడుతున్న అన్ని కంపెనీలకు ఆ వివరాలు చేరవేయబడతాయి. కేవైసీలో ఈ వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి పెట్టుబడిదారుడు ఛేంజ్ ఆఫ్ కేవైసీ ఫారంను నింపాలి. దీనిలో మారిన అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వాటిని పొందుపర్చాలి. మార్పు లేని వాటి స్థానంలో పాత వాటినే యధాతథంగా రాయాలి. పూర్తిగా ఫారంను నింపిన తర్వాత సంబంధిత ధృవీకరణ పత్రాలను మరియు పాన్‌కార్డు జిరాక్స్ కాపీని జతచేసి సీఎఎంఎస్ లేదా కార్వీ వంటి వాటిల్లో సమర్పించాలి. ధృవీకరణ పత్రాలపై పెట్టుబడిదారుడి సంతకం మరియు ఏదైనా ఒక ప్రస్తుత పెట్టుబడులకు సంబంధించిన ఫోలియో నెంబరు, ఫండ్ పేరును పేర్కొనడం ముఖ్యం.


Click it and Unblock the Notifications