ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎటిఎం లేదా డెబిట్‌ కార్డు తీసుకోవడం మామూలే. అయితే ఎప్పుడంటే అప్పుడు ఎటిఎం నుంచి డబ్బులను తీసుకునే వెసులుబాటు ఉండటం, షాపింగ్ కోసం లేదా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు ఈ కార్డులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.

అయితే పరిమితికి మించి ఏటీఎం కార్డుని ఉపయోగిస్తే బ్యాంకులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏ బ్యాంకులో అయితే అకౌంట్‌ను కలిగి ఉంటారో ఆ బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదుసార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడుసార్లు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వెసులుబాటుని బ్యాంకులు అందిస్తున్నాయి.

కాగా, ఈ పరిమితి మించితే చార్జీలు చెల్లించాల్సిందే. ఎక్కువగా సార్లు కార్డును వినియోగిస్తే చార్జీల మోత మరింతగా మోగుతుంది. ఈ క్రమంలో చార్జీల భారం నుంచి బయటపడాలంటే బ్యాంకు డెబిట్ కార్డు విషయంలో కొన్ని మెళకువలు పాటించాలి. అలా పాటించడం వల్ల కొంత మేరకు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

 ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

షాపింగ్‌ చేసే ముందు లేదా డబ్బులను మరోక ఖాతాలో వేయాలనుకునే వారు ఏటీఎంల నుంచి డబ్బులను విత్‌డ్రా చేస్తుంటారు. ఇలా చేయడానికి బదులు డిజిటల్‌ పేమెంట్‌కు లేదా వాలెట్‌ సర్వీసుల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తే మంచిది. డిజిటల్‌ వాలెట్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకుంటే.. మొబైల్‌ ఫోన్‌ ద్వారానే అవసరమైనప్పుడు చెల్లింపులు చేయవచ్చు.

 ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

డిజిటల్‌ రూపంలో నగదును ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. డిజిటల్‌ వాలెట్లు, కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ సేవలు సురక్షితమైనవే కాకుండా వ్యయాలను తగ్గించేవిగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల డబ్బులు లేని ప్రతిసారి ఎటిఎం వద్దకు పరుగులు తీయాల్సిన పని కూడా తప్పుతుంది.

 ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

సాధారణ కస్టమర్లతో పోల్చితే ప్రయారిటీ బ్యాంకింగ్‌ కస్టమర్లకు బ్యాంకులు పెద్దపీట వేస్తుంటాయి. ఉదాహరణకు నెలలో ఖాతాలో కనీసం 25,000 రూపాయల నగదు నిల్వను ఉంచగలిగే స్థోమత ఉంటే బ్యాంకు వద్ద ప్రయారిటీ ఖాతాను తీసుకుంటే మంచిది. ఇలాంటి ఖాతా ఉన్న వారికి బ్యాంకులు అదనపు సౌకర్యాలను అందిస్తాయి.

 ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

అదనంగా ఎటిఎం లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తాయి. ఉచితంగా ఎటిఎంను వినియోగించే పరిమితి దాటిపోయినప్పుడు వేసే ఫీజును బ్యాంకులు మాఫీ చేసే అవకాశం కూడా ఉంటుంది. వంద, రెండొందలు అవసరం ఉన్నా ఎటిఎం నుంచి విత్‌డ్రా చేసుకునే వారు చాలా మంది ఉంటారు. దీని వల్ల ఎటిఎం వినియోగ పరిమితి దాటి చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలను తగ్గించుకోవడం ఎలా?

ఖాతాలో ఎంత నిల్వ ఉన్నదో తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఏటీఎంను వినియోగిస్తుంటారు. దీనిని కూడా బ్యాంకులు ఒక లావాదేవీగానే పరిగణిస్తారు. నగదు నిల్వను తెలుసుకోవడానికి బ్యాంకులు ప్రత్యేకమైన ఫోన్‌ నెంబర్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. సంబంధిత బ్యాంకు శాఖలో లేదా బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+