చాలా మంది ఉద్యోగం మారగానే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను తీసేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పీఎఫ్ నిధిని ముట్టుకోకుండా, వేరే ఉద్యోగంలో చేరిన తర్వాత కొత్త కంపెనీ పీఎఫ్ ఖాతాకు బదిలీ చేసుకోవడం చాలా ఉత్తమం.
ఎందుకంటే ప్రస్తుతం పీఎఫ్ నిబంధనల ప్రకారం ఐదేళ్లలోపు పీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించి ఆదాయపు పన్ను చెల్లించాలి. అప్పటివరకూ తీసుకున్న ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుత కంపెనీలో మీరు ఐదేళ్లకు మించి పని చేశారనుకుందాం. పీఎఫ్ నిధి కింద రూ. 10 లక్షలు వచ్చిందనుకుందాం. ఇలాంటప్పుడు మీరు ఉద్యోగం మానేస్తే మీకు వచ్చిన పీఎఫ్ సొమ్మును ఏయే మార్గాల్లో మదుపు చేస్తే మంచిదో చూద్దాం.

పీఎఫ్ కొనసాగించడమే మేలు
సాధారణంగా ఉద్యోగాలు చేసే వారు ఇన్‌కమ్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు గాను రుణం తీసుకుంటుంటారు. మీకు అలాంటి రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని తీర్చేయాలి. దీంతో పాటు 13 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణం ఉంటే వెంటనే ఆ రుణాన్ని కూడా తీర్చేయండి.

పీఎఫ్ కొనసాగించడమే మేలు
ఇక ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ దాదాపు 10 శాతం కంటే ప్రావిడెండ్ ఫండ్ నిల్వపై వచ్చే వడ్డీ 8.7 శాతం తక్కువ. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ రుణాన్ని తీర్చకుండా పదవీ విరమణ తర్వాత ప్రావిడెండ్ ఫండ్‌ను కొనసాగించడం మంచిది.

పీఎఫ్ కొనసాగించడమే మేలు
ముఖ్యంగా వయసు పైబడిన వారు చేయాల్సిన పని. మీ పీఎఫ్ నగదుని మ్యూచువల్ ఫండ్స్‌లోని బాండ్ పథకాల్లో మదుపు చేస్తే మంచిది. వీటి నుంచి ప్రతినెలా కొంత మొత్తం ఈక్విటీ ఫండ్లలోకి ఎస్‌టీపీ ద్వారా మళ్లించండి. ఇలా చేయడం వల్ల ప్రావిడెంట్ ఫండ్‌లో వచ్చే 8.7 శాతం రాబడి కంటే దీర్గకాలంలో ఈక్విటీ మ్యూచవల్ ఫండ్‌లో ఎక్కువ రాబడి పొందే వీలుంది.

పీఎఫ్ కొనసాగించడమే మేలు
కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి బదులు మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటే మాత్రం పీఎఫ్ సొమ్మును ఈక్విటీలో మదుపు చేయండి. కాదు వ్యాపారమే చేయాలనుకుంటే మాత్రం పీఎఫ్ సొమ్మును సురక్షిత పథకాల్లో ఉంచుకొని అవసరానికి వ్యాపారంలో వినియోగించుకునేలా చేసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications