హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్ యాప్‌ని ఉపయోగించడం ఎలా?
చెల్లింపులన్నీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 'పేజాప్' పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు కోసం ఈ యాప్ జూన్ 15వ తేదీ నుంచి ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్ సాయంతో కస్టమర్లు ఒకే ఒక్క క్లిక్‌తో బ్యాంకుకు అనుసంధానమై నిధుల బదిలీ, మొబైల్ రీచార్జ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ట్రావెల్ బుకింగ్‌లు, మూవీ టికెట్ బుకింగ్‌లు, ఆహారం ఆర్డర్ చేయడం వంటి కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చు.
చేతి వేళ్లతోనే ఆన్ లైన్ షాపింగ్, ఖాతాలకు నగదు బదిలీ లాంటి క్షణాల్లో అయిపోతాయి. ఎవరైతే కస్టమర్లు సొంతంగా సేవింగ్స్ ఖాతా లేదా శాలరీ ఖాతాను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈ యాప్‌ను తమ తమ స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటే మంచిది.
ఈ యాప్‌ని విడుదల చేసిన సందర్భంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రయోగమని, డిజిటల్ బ్యాంకింగ్‌లో ఓ సరికొత్త విప్లవమని పేర్కొన్నారు.
పేజాజ్ సహాయంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులు ఇన్సూరెన్స్ కొనుగోలు, లోన్లకు దరఖాస్తుల వంటివి చేసుకోవడం లాంటి కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్ యాప్‌లో రిజిస్టర్ అవ్వడం ఎలా?

1. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
2. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ని నిర్ధారించండి
3. కొనసాగించండి
4. ఈమెయిల్ ఐడీ, పూర్తి పేరు, పుట్టినరోజు లాంటి వివరాలు అందించండి
5. పేజాప్ పిన్ నెంబర్‌ను అందించండి
6. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన పిన్ నెంబర్‌ను అందించండి
7. నిర్ధారణ కొరకు క్లిక్ చేయండి.
ఈ యాప్ సాయంతో హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ లావాదేవీల వ్యయాన్ని కూడా డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తారు. పేజాప్ ద్వారా లావాదేవీల కోసం ఇప్పటికే క్లియర్‌ట్రిప్, ఫ్లిప్‌కార్ట్, పివిఆర్, బుక్ మై షో, ఇండి గో వంటి కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications