కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరు పేదల కోసం బీమా, ఫించను పథకాలను ప్రకటించింది. బీమా పథకాలుగా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రకటించగా, ఫించన్ పథకం కింద అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించారు. అయితే ప్రధాన మంత్రి సురక్షా బీమో యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాల్లో ప్రజల్లో కొంత గందగోళం నెలకొంది.
ఈ రెండు పథకాలు కూడా బీమా పథకాలైనప్పటికీ, ఒకే విధంగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించడానికి గాను ఈ రెండు పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠకులకు అందజేస్తున్నాం.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
ఇది జీవిత బీమా పథకం. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండి.. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారెవరైనా ఈ పథకంలో చేరడానికి అర్హులే. ఏడాదికి రూ. 330 ప్రీమియం చెల్లించాలి. ఖాతాదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే రూ. 2 లక్షల జీవిత బీమాను నామినీకి అందజేస్తారు. అయితే, ఈ పథకంలో చేరే సమయానికి వారికి ఎలాంటి తీవ్ర అనారోగ్యమూ లేదనే ధ్రువీకరణ పత్రం నింపి అందజేయాల్సి ఉంటుంది.

ఆ పత్రాలు బ్యాంకుల్లో లభ్యమవుతాయి. ఒకవేళ నాలుగు బ్యాంకుల్లో ఖాతాలుండి.. నాలుగు ఖాతాల నుంచీ ప్రీమియం కట్టినా, క్లెయిం ఒక బ్యాంకు నుంచి మాత్రమే పొందే వీలుంటుంది. ఈ పథకం జూన్ 1, 2015 నుంచి అమల్లోకి వస్తుంది. 2015 మే 31లోగా ఆటో డెబిట్‌కు ఆమోదం తెలిపినవారికి 2015, జూన్ 1 నుంచి 2016 మే 31 దాకా బీమా కవరేజీ ఉంటుం ది.
ఒకవేళ ఈ నెల 31లోపు ఆమోదం తెలపలేకపోయినా ఫర్వాలేదు. ఆటో డెబిట్ ప్రత్యామ్నాయానికి ఆమోదం తెలిపేందుకు 2015 ఆగస్టు 31 వరకూ అనుమతించే అవకాశం ఉంది. ఏడాది ముగిశాక ప్రీమియం కట్టకపోతే కవరేజీ ఉండదు. అయితే, అలా ఒకటి రెండేళ్లపాటు ప్రీమియంను పునరుద్ధరించుకోకుండా ఉన్నవారు మళ్లీ ఈ పథకంలో ప్రవేశించే అవకాశం ఉంది.
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన
ఇది ప్రమాద బీమా కవరేజీ పథకం. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉండి.. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు అర్హులు. ఏడాదికి రూ. 12 ప్రీమియం కడితే చాలు. ప్రమాద స్థాయిని బట్టి బీమా చెల్లింపు ఉంటుంది. జీవన్ జ్యోతి బీమా పథకం కింద ప్రీమియం కట్టినవారు ఏ విధం గా మరణించినా రూ.2 లక్షల కవరేజీ ఉంటుంది.
కానీ, ఇది యాక్సిడెంట్ మరణాల కు మాత్రమే పరిమితం. రెండిటికీ కట్టినవారు యాక్సిడెంట్‌లో మృతి చెందితే.. నామినీలు జీవన్ జ్యోతి పథకం కింద రూ.2 లక్షలు, ఈ సురక్షా బీమా పథకం కింద రూ.2 లక్షలు క్లెయిం చేయవచ్చు. అదే, సహజ మరణం సంభవిస్తే జీవన్ జ్యోతి బీమా పథకం కింద రూ.2 లక్షలు మాత్రమే వస్తాయి.
అటల్ పెన్షన్ యోజన
అసంఘటిత రంగంలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏ విధమైన సామాజిక భద్రతా పథకంలో సభ్యులుగా లేని 18-40 ఏళ్ల మధ్య వయసు ప్రజలు ఈ పథకంలో చేరవచ్చు. వీరికి 60 ఏళ్ల నిండాక ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5 వేల వరకూ పెన్షన్ అందుతుంది. ఇలా అందుకునే ప్రయోజనం ఎంత ఉండాలనుకుంటున్నారో దానిని బట్టే ప్రీమియం చెల్లించాలి.
ఈ పథకంలో చేరే సమయానికి ఆయా వ్యక్తుల వయస్సును బట్టి కూడా ప్రీమియం విలువ మారుతుంది. 18 ఏళ్ల వయస్సులోనే పథకంలో చేరితే రూ.1000 పెన్షన్ కోసం రూ.42, రూ.5 వేల పెన్షన్ కోసం రూ.210 ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి.
| Features | Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) |
| Eligibility | 18-70 years | 18-50 years |
| Premium | Rs. 12 per annum | Rs. 330 per annum |
| Cover ceasing age | At the age of 70 years | At the age of 55 years |
| Death Benefit | Nil | Rs.2 lakhs |
| Disability | Rs.2 lakhs | Nil |
| Purpose of Insurance | Accidental Death and Disability | Life insurance |
| Features | Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) |
| Sum Assured (Fixed) | Rs.2 lakhs | Rs.2 lakhs |
| Maturity Benefit | Nil | Nil |
| Accidental Death Benefit | Rs.2 lakhs | Rs.2 lakhs |
| Maximum Insurance cover | Rs.2 lakhs | Rs.2 lakhs |
| Mode of Payment | Premium to be auto debited | Premium to be auto debited |
| Insurance period | 1 June to 31 May | 1 June to 31 May |
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications