పన్ను ఆదా కోసం బీమా పాలసీ తీసుకోవడం మంచిదేనా...?
మార్చి దగ్గరకు వస్తుందంటే చాలు... అందరి దృష్టి పన్నుకోత ఎలా తప్పించుకోవాలా అనే దాని గురించే ఆలోచిస్తుంటారు. పొదపు, మదుపు చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. పన్ను భారాన్ని తప్పించుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. కానీ చాలా మంది ఒకేసారి ఈ రెండూ పనులకూ ఉపయోగపడే బీమా పథకాలను ఎంచుకునేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తుంటారు.
దీంతో బీమా కంపెనీలు లెక్కకుమించి కొత్త పథకాలను తీసుకువస్తున్నాయి. పన్ను ఆదా కోసం బీమా పాలసీల వైపు మొగ్గు చూపే చాలా మంది కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. తొందరలో పాలసీ తీసుకొని పన్ను భారం తప్పించుకున్నామని అనుకుంటే, ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు.
పన్ను ఆదా కోసం బీమా పాలసీలను ఎంచుకునే వారినే లక్ష్యంగా చేసుకొని జీవిత బీమా కంపెనీలు యులిప్‌లను ప్రవేశ పెడుతుంటాయి. బీమా కంపెనీలు పాలసీలను అమ్ముకోవడానికి ఈ ఒక్క విషయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఎలాంటి పాలసీ తీసుకోవాలి
పన్ను తప్పించుకోవాడనికి ఇలాంటి పాలసీలు తీసుకుంటే ఆ తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నెల నెలా పాలసీ నిబంధనలను బట్టి క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ప్రీమియాన్ని పెట్టుబడిగా పరిగణిస్తారు చాలా మంది. బీమా అసలు లక్ష్యం మనకేమైనా జరిగితే, మన మీద ఆధారపడిన వారికి ఆర్ధికంగా కొండంత అండగా నిలవాలి. దీనిని మరిచిపోయి వ్వవధి తీరిన తర్వాత వచ్చే సొమ్ము ఆధారంగా పాలసీలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదు.
భారీ ప్రీమియాలు చెల్లించే పాలసీలు మంచిది కాదు
పన్ను తప్పించుకోవాలంటే రూ. 40 వేలు మదపు చేయాలనుకోండి. వెంటనే ఆ సొమ్ముతో ప్రీమియం చెల్లించేసి ఓ పాలసీని తీసుకోవడం ఎక్కువ మంది చేసే పొరపాటు. బీమా పాలసీ అంటే రెండు మూడేళ్లలో అయిపోయేది కాదు. ఇప్పుడు పాలసీ మెర్చూరిటీ సమయం కూడా మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెరిగింది.
దీని ఉద్దేశం ఏమిటంటే క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తేనే మీ పాలసీని రద్దు చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు చేతిలో ఎక్కువ డబ్బు ఉందని, ఎక్కువ ప్రీమియం చెల్లించే పాలసీని ఎంచుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు.
స్నేహితులు లేదా బంధువులు తీసుకున్ పాలసీని ఎంచుకోవడం
ఎప్పుడూ పరిస్ధితులు ఒకేలా ఉండవు. కాబట్టి మీ స్నేహితులు లేదా బంధువులు తీసుకున్న పాలసీని మీరు తీసుకుంటానని అనడం ఎంత మాత్రం సబబు కాదు. యులిప్ పాలసీలు తీసుకుని ఎక్కువ మంది ఇక్కడే నష్టపోతున్నారు. పాలసీల విషయంలో మొహమాటాలు ఎంత మాత్రం పనికిరావు. మీ ఆదాయానికి సరిపడ పాలసీలను మాత్రమే ఎంచుకోవాలి.
ఎప్పటికప్పుడు మంచి సలహాలు ఇస్తూ, సరైన పాలసీలను వివరించే ఏజెంట్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. చాలా మంది ఏజెంట్ మొదటి ప్రీమియం కట్టిస్తానంటే చాలు... ఆ ఏజెంటు చెప్పిన పాలసీనే తీసుకుంటారు. అతను చెప్పిన చోట సంతకాలు పెట్టేస్తుంటారు. ఈ పద్ధతి ఎంత మాత్రం సరికాదు.
పాలసీ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని విషయాలు తెలుసుకుని ఎంచుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications