మాన్‌స్టర్ ఫిష్: ఉద్యోగి నిజాయితీకి పరీక్ష
బెంగళూరు: చాలా కాలంపాటు ఒకే ఉద్యోగం చేస్తూ నిద్రావస్థలో ఉన్న ఉద్యోగులను మేల్కొలిపే ఉద్దేశంతో జాబ్స్ సర్చ్ పోర్టల్ అయిన మాన్‌స్టర్ కొత్తగా మాట్లాడే చేప పేరుతో ఓ ప్రటకనను రూపొందించింది. చిన్న చిన్న విషయాలు అతన్ని ఆ నిద్ర నుంచి మేల్కొల్పలేవనే ఉద్దేశంతో ఈ ప్రకటనలో చేప ఉద్యోగితో మాట్లాడుతుంది. అయితే ఆ ఉద్యోగి చేప మాటలకు ప్రభావితమవుతాడా లేదా అన్నది చూడాలి.

తన అసంతృప్త ఉద్యోగం నుంచి బయటికి వచ్చి మంచి ఉన్నతమైన అవకాశాలను వెతుక్కోవాలని, వాటి ప్రాముఖ్యత గురించి ఉద్యోగికి వివరిస్తుంది. చేప మాటలను విన్న ఉద్యోగి తన ఉద్యోగ సమయంలో ఎంత సమయాన్ని వృథా చేస్తున్నాడనేది గుర్తిస్తాడు. అంతేగాక తన సామర్థ్యానికి తగినట్లు విధులు నిర్వహించడం లేదని తెలుసుకుంటాడు.
ఈ చేప ప్రకటన ద్వారా ఉద్యోగి తనకు అవసరమైన మేల్కొలుపును పొందుతాడు. ఈ ప్రకటనతో ఒక్క ఉద్యోగే కాదు ఇలాంటి వేలాది మంది సూచనలు అవసరమున్న ఉద్యోగులు మేల్కొనే అవకాశం ఉంది. ఆ చేపను కొందరు సల్మాన్ రష్దీగా, మరికొందరు ట్యూనా పటేక్‌గా పిలుస్తున్నప్పటికీ, దాని పేరు ఇంకా రహస్యంగానే ఉంది. చేప ప్రకటనను http://www.monsterindia.com/campaign_index.html చూడవచ్చు.


Click it and Unblock the Notifications