For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత టైమ్‌లో ఆర్‌టిజిఎస్ కింద నిధులు బదిలీ?

|

 RTGS
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టిజిఎస్) అంటే మనం సూచనలు స్వీకరించే సమయంలోపే ద్రవ్యం(నిధులు) బదిలీ చేసే ఓ యాంత్రిక విధానం. భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో బెనిఫిషియరీ బ్రాంచులకు రెమిటింగ్ బ్యాంకుల నుంచి రియల్ టైమ్‌లోనే నిధులు బదిలీ జరగాలి.

ఫండ్స్ బదిలీ సందేశం స్వీకరించిన రెండు గంటలలోపు బెనిఫిషియరీ బ్యాంకు తన బెనిఫిషియరీ ఖాతాలోకి నిధులను బదిలీ చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు నుంచి రెమిటింగ్ బ్యాంకు సందేశాన్ని స్వీకరించిన వెంటనే మనీ(నిధులు) రిసివింగ్ బ్యాంకులో జమ కావాల్సి ఉంటుంది.

రెమిటింగ్ బ్యాంకు తన రెమిటింగ్ ఖాతాదారుకు ఎస్ఎంఎస్ ద్వారా తన (రిసీవింగ్ బ్యాంకు)ఖాతాలో నిధులు జమ అయ్యాయని సందేశం పంపుతుంది. ఇలాంటి సందేశాలు వచ్చేందుకు మీరు ముందుగానే మీ మొబైల్ ఫోన్ నెంబర్ బ్యాంకులో ఇచ్చి అక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

రెమిటింగ్ ఖాతాదారుకు నిధులు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందా?

అయితే రెమిటింగ్ ఖాతాదారుకు నిధులు బదిలీ చేసుకునే అవకాశం అనేది రెమిటింగ్ ఖాతాదారు, రెమిటింగ్ బ్యాంకు చేసుకున్న ఏర్పాట్లను బట్టి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ సర్వీసును ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కల్పిస్తున్నాయి. ఒకసారి ఖాతాదారు ఖాతా నుంచి బెనిఫిషియరీ బ్యాంకుకు నిధులు బదిలీ కాగానే అతనికి రెమిటింగ్ బ్యాంకు నుంచి అందుకు సంబంధించిన ఈ మెయిల్ రావడం గానీ లేదా మొబైల్ ఎస్ఎంఎస్ రావడం గానీ జరగుతుంది. ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందేందుకు బ్యాంకులలోని‌ఆర్ టిజిఎస్/ఎన్ఈఎఫ్‌టి ఖాతాదారుల సౌకర్యాల కేంద్రాల్లో సంప్రదించి పొందవచ్చు.

Story first published: Tuesday, November 5, 2013, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X