For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ అంటే ఏమిటీ..?

By Nageswara Rao
|

National Spot Exchange
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ వస్తువులపై స్పాట్ ట్రేడింగ్ వీలు కల్పించే అధ్బుతమైన ప్లాట్ ఫామ్. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ రెండింటి జాయింట్ వెంచరే ఈ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్. భారతదేశంలో ఉన్న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, మల్టీ కమోటిడీ ఎక్స్ఛేంజ్‌ల మాదిరిగానే ఈ ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ పని చేస్తుంది.

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ లైవ్ ట్రేడింగ్‌ని మొట్టమొదటి సారి అక్టోబర్ 15, 2008లో ప్రారంభించింది. మొదటి సారి వెండి మరియు బంగారు కడ్డీలు దిగుమతి కోసం అహ్మదాబాద్‌, ముంబై వేదికగా పత్తి బేళ్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 52 వస్తువులను 16 రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాజధానుల నుండి దిగుమతి చేసుకుంటుంది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఎగుమతిదారులు వస్తువులు, రైతులు, దిగుమతిదారులు, ప్రాసెసర్లు మరియు వ్యాపారులు సేకరణ, నిల్వ, గిడ్డంగి రసీదులు ఫైనాన్సింగ్ మరియు మార్కెటింగ్ కోసం కస్టమ్ చేసిపెట్టిన పరిష్కారాలను అందిస్తుంది.

ఇన్వెస్టర్లు ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడులు పెట్టడం చాలా మంచింది. ఇందులో ప్రతి వంద గ్రాముల వెండిని ఒక యూనిట్‌ అంటే ఒక షేర్‌గా పరిగణిస్తారు. మన సామర్ద్యాన్ని బట్టి ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలు చేసిన తర్వాత మామూలు షేర్ల లాగే మన డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి. అంతేకాకుండా మామూలు షేర్ల మాదిరే వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. వెండి కొనాలంటే డీమ్యాట్‌లోని యూనిట్లును సరెండర్ చేస్తే వెండిని ఇస్తారు (కొన్ని షరతులకు లోబడి). కాబట్టి వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఒక ఉత్తమమైన సాధనం

వన్ఇండియా మనీ తెలుగు

English summary

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ అంటే ఏమిటీ..? | What is National Spot Exchange (NSEL)

National Spot Exchange Ltd. (NSEL) not to be confused with the National Stock Exchange (NSE) is a platform facilitating spot trading in commodities. The national-level, electronic and transparent institution is a joint venture of Financial Technologies India Limited.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X