మీరు జీతం పన్ను పరిమితిని మించితే 80C మరియు ఇతర ప్రమాణాలు సమర్పించడం ఉన్నప్పటికీ.. మీ యజమాని మీ వద్ద నుండి పన్నుని తీసివేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియను TDS అంటారు. ఆర్థిక సంవత్సరం ముగిసే చివరలో ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్, ఇతర ఆధారాల ఆధారంగా యాజమాన్యం ఫామ్ 16 ఇస్తుంది. ఈ ఫామ్ 16లో మీరు సమర్పించిన పన్ను వివరాలతో పాటు మీ మొత్తం జీతానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ ఫామ్ 16ను మీ యాజమాన్యం మాత్రమే ఇస్తుంది.
ఈ ఫామ్ 16 సహాయంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. దీనితో పాటు ఆదాయానికి సంబంధించిన కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఆదాయ వివరాలను (పన్ను వర్తించే లేదా వర్తించని) కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ), 80 సి సెక్షన్ కింద సేవింగ్స్ (పీపీఎఫ్, ఈపీఎఫ్, బీమా లాంటివి) వాటిని వెల్లడించి, వాటి ఆధారాలను సమర్పిస్తుంటారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఇతర ఆదాయ వనరులు ఏంటో చూద్దాం.
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి పొందిన వడ్డీ:
రూ. 10,000 వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి పొందిన వడ్డీకి పన్ను వర్తించని ఆదాయం. అంతకు మించిన వడ్డీ పొందితే మాత్రం దానికి పన్ను వర్తిస్తుంది.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ:
ఇన్‌కమ్ టాక్స్ శ్లాబ్‌ను బట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.
రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ:
ఒక వ్యక్తి ఇన్‌కమ్ టాక్స్ శ్లాబ్‌ను బట్టి రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ అనేది పన్ను వర్తించేదిగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లపై పొందిన వడ్డీ పై బ్యాంకులు ఎలాంటి టీడీఎస్‌ను మినహాయించవు కాబట్టి ఈ విధమైన ఆదాయ వనరును వెల్లడించడం మరింత ప్రధానం.
పోస్టల్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సి) పై పొందిన వడ్డీ:
పోస్టల్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సి) పై పొందిన వడ్డీ అనేది పన్ను వర్తించేది. దీన్ని తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది.
నగదు బహుమతులు:
రూ. 50,000కు మించి పొందిన నగదు బహుమతుల వివరాలను ప్రకటించాలి.
క్యాపిటల్ గెయిన్స్ / లాసెస్:
ట్రేడింగ్ ఈక్విటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్ విక్రయాలు, బంగారం వంటి వాటిపై క్యాపిటల్ గెయిన్స్/లాసెస్‌ను, వాటికి పన్ను వర్తించనప్పటికీ, వెల్లడించాలి. అదే విధంగా ఏవైనా నష్టాలుంటే కూడా వెల్లడించాలి. తదుపరి సంవత్సరాల్లో లాభాల నుంచి ఈ నష్టాలను తగ్గించే వీలుంటుంది.
సంవత్సరకాలంలో మొదటి ఆరు నెలలు ఒక సంస్థలో, మరో ఆరునెలలు మరో సంస్థలో పని చేస్తే, ఆ రెండు ఫామ్ 16లను కలిపి ఒక్కటిగా దాఖలు చేయాలి. చాలా మంది ఉద్యోగులు మొదటి దానిని మరిచిపోతుంటారు. ఈ - ఫైలింగ్ విధానంలో ఐటి రిటర్న్స్ వివరాల నమోదు తర్వాత డిజిటల్ సంతకం కూడా అనుసంధానం చేస్తే మీ ఈ - ఫైలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తర్వాత బెంగుళూరులో ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు ఐటి రిటర్న్స్ దాఖలు చేసిన వ్యక్తి సంతకం పెట్టి స్పీడ్ పోస్ట్‌లో గానీ, సాధారణ పోస్ట్‌లో గానీ 120 రోజుల్లోపు పంపిచాల్సి ఉంటుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications