ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే జరిమానా ఏమిటి..?

ఎవరైనా వ్యక్తి రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లైతే ఆన్ లైన్‌లో http://incometax.sparshindia.com/pan/newPAN.asp అనే వెబ్ సైట్‌కి లాగిన్ అయి తన వద్ద ఉన్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని ఇన్ కమ్ టాక్స్ వెబ్ సైట్‌లో జత చేయాలి. ఇక ఆఫ్ లైన్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్‌లో ఉన్న అధికారులకు అందజేయాలి. అప్లికేషన్‌లో ఉన్న చివరి కాలమ్‌లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి.
ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో అప్లికేషన్‌లో పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు డిటేల్స్ వ్రాయాలి. ఆ తర్వాత సదరు అధికారి మీకు రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేసినట్లు మీరు రసీదు ఇవ్వడం జరుగుతుంది.
పాన్ కార్డు ఎటువంటి సమయాల్లో అవసరం:
* బ్యాంక్‌లో రూ. 50 వేలకు మించి ఫిక్సడ్ డిఫాజిట్ చేస్తున్నప్పుడు
* పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో రూ. 50లకు మించి నగదు డిఫాజిట్ చేసినప్పుడు.
* మోటర్ వాహనం కొనుగోలు, అమ్మకాలు (ద్విచక్రవాహనాలు మినహామింపు)
* సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాల్లో రూ. 11 లక్షలకు మించినప్పుడు.
* బ్యాంక్‌లో ఏదైన ఖాతాను తీసుకుంటున్నప్పుడు
* విదేశీ ప్రయాణం కోసం రూ. 25 వేల నగదు చెల్లించినప్పుడు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications