
అసలు వ్యాట్ ఎందుకు ప్రవేశపెట్టారు:
ప్రజల వద్ద నుండి పన్నుల వ్యవస్దను సరళతరం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యాట్‌ను తొలిసారిగా 1954లో ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తొలిసారిగా ఎల్ కె ఝూ కమిటీ (197) సూచించింది. ఎల్ కె ఝూ సూచనల మేరకు మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో వెూడ్ వ్యాట్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పనిచేసిన పన్నుల సంస్కరణ కమిటీ కేంద్రీకృత వాల్యు యాడెడ్ ట్యాక్స్‌ను సూచించింది. దీని తర్వాత 2000-01 బడ్జెట్ నుండి ఎక్సైజ్ సుంకాల విషయంలో సెన్ వ్యాట్ (CENVAT) ను ప్రవేశపెట్టారు.
వ్యాట్ సాధికార కమిటీ:
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాట్‌ను అమలుపరిచేందుకు విధివిధానాలను రూపొందించేందుకు 2000వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వ్యాట్ సాధికార కమిటీ ఏర్పడింది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి ఆసిన్ దాస్ గుప్తా ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు. మన దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను అమలు చేసిన మొదటి రాష్ట్రం హర్యానా. చివరిగా వ్యాట్‌ను ఆమోదించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, అండమాన్, లక్షదీవులలో అమ్మకం పన్ను అమలులో లేనందున వ్యాట్ అమలులో లేదు. ఇక మన రాష్ట్రానికి వస్తే వ్యాట్ 2005 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో రూ. 5 లక్షలలోపు టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులకు వ్యాట్ నుండి మినహాయింపు ఉంది.
ఆధారిత పన్ను (వ్యాట్) వల్ల లాభాలు:
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
రాష్ట్రంలోపన్ను ఎగవేతను అరికట్టవచ్చును.
రాష్ట్రంలో పన్ను భారాన్ని తగ్గించవచ్చును.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications