
18 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు ట్యూషన్స్ లాంటి ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్లైతే తప్పనిసరిగా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు సంపాదించే ఆదాయం రూ. 2 లక్షలుకు పైగా ఉన్నట్లైతే పెద్దవారి మాదిరే వీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న మైనర్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే దానికి వివిధ మార్గాలున్నాయి. మీ తండ్రి గనుక మీ పేరు మీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసినట్లైతే... దాని ద్వారా మీరు వడ్డీని పొందుతుంటే, ఈ ఆదాయాన్ని మీరు మీ సొంత ఆదాయంగా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో చూపించుకోవచ్చు.
మైనర్ ఎప్పుడు కూడా సపరేట్‌గా ఆదాయాన్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు టాక్స్‌ను ఫైలింగ్ చేసే సమయంలో మీ తండ్రి లేదా సంరక్షుడి పేరును ప్రస్తావించవచ్చు. ఆదే 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని సంపాదిస్తుంటే తప్పనిసరిగా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ. 2లక్షలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తుంటే తప్పనిసరిగా రిటర్న్స్ దాఖలు చేయాలి. అదే రూ. 5 లక్షలు పైబడి మీ ఆదాయం ఉంటే ఎలక్ట్రానిక్ రూపంలో రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ అనేది ప్రస్తుతం ఆన్ లైన్‌లో కూడా దాఖలు చేసే వెసులుబాటుని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేందుకు చివరి తేదీ జులై 31గా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇన్ కమ్ స్లాబ్స్ కూడా పురుషులకు , స్త్రీలకు , సీనియర్ సిటజన్స్ కు వేరు వేరు గా ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలు, సీనియర్ సిటజన్స్ కు టాక్స్ చెల్లించడం లో కొంత ఉపశమనం ఉంటుంది.ఐతే మీరు ఎంత మొత్తం ఇన్ కమ్ టాక్స్ చెల్లించడం అనేది మీరు ఆ సంవత్సరంలో సంపాదించిన ఆదాయం , మీరు ఆ సంవత్సరంలో తీసుకున్న టాక్స్ సేవింగ్ చర్యల పై ఆధారపడి ఉంటుంది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications