ఒక్క క్లిక్ తో అన్నీ మన గుమ్మం ముందుకే వచ్చే రోజులివి. దీనికి తగ్గట్టే మెడిసిన్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. పైగా 20% నుంచి 30% డిస్కౌంట్ ఇచ్చి మరీ మెడిసిన్ డెలివరీ చేస్తారు. ఈ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. దేశీయ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పరిమాణం రూ లక్ష కోట్లకు పైమాటే. అందుకే అపార అవకాశాలు ఉన్న ఆన్లైన్ ఫార్మసీ లేదా మెడిసిన్ డెలివరీ విభాగంలోకి చాలా కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. అయితే, ఇటీవలి ఢిల్లీ హై కోర్ట్ తీర్పు తో ఈ కంపెనీలకు షాక్ తగిలింది.
ఇక పై ఆన్లైన్ లో మెడిసిన్ విక్రయించకూడని కేంద్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిర్ణయం తీసుకోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్స్ రెగ్యూలేటర్ల కు లేఖలు రాసింది. వెంటనే ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. జహీర్ అహ్మద్ అనే వ్యక్తి 2018 డిసెంబర్ లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) పై తన తీర్పునిస్తూ ఈ-ఫార్మసీ లని నియంత్రించే విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించే వరకు అక్రమంగా, లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ ఆన్లైన్లో విక్రయించకుండా నిషేధం విధించింది. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా సంస్థ పేస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) వెల్లడించింది.

లైసెన్స్ లేకుండానే...
ప్రస్తుతం దేశంలో మెడిసిన్ ఆన్లైన్ లో విక్రయించేందుకు ఎలాంటి విధానాలు లేవు. మన దేశ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ ఆక్ట్ 80 ఏళ్ళ క్రితం రూపొందించారు. అయితే, కాల క్రమంలో కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ విస్తృతి పెరిగిన తర్వాత కొత్త తరహా వ్యాపారాలు పురుడు పోసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి విధానాలు లేకపోవటంతో చాలా కంపెనీలు డ్రగ్స్ లైసెన్స్ లేకుండానే ఆన్లైన్ లో మెడిసిన్ విక్రయిస్తున్నారు. వీటినే ఈ-ఫార్మసీ లు అని పేర్కొంటున్నారు. అయితే కొందరు మాత్రం మందులను విక్రయించేందుకు లైసెన్స్ కలిగి ఉన్న వారు ... అదే లైసెన్స్ తో ఆన్లైన్ లోనూ మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. అయితే, ఈ విధానంలో నెలకొన్న సున్నితమైన అంశాలు దేశ పౌరుల ఆరోగ్యం, భద్రతకు ముప్పు కలిగించేలా ఉండటం వల్ల సర్వత్రా ఆందోళన నెలకొంది.
మాకు లైసెన్స్ అక్కరలేదు...
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన అహ్మద్... తన పిటిషన్ లో ఆన్లైన్ ఫార్మసీలపై ఆరోపణలు గుప్పించారు. అవి ప్రభుత్వాల ఆదేశాలను బేఖారు చేస్తూ అమ్మకాలను కొనసాగిస్తున్నాయి అన్నారు. ఆన్లైన్ లో మెడిసిన్ దొరకటం వల్ల ప్రజలు వాటికి అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉందని, మెడిసిన్ విచ్చలవిడి వినియోగం కూడా ప్రమాదం కొనితెచ్చిపెడుతుందని ఆందోళన వెలిబుచ్చారు. అయితే, జులై లో కోర్ట్ లో తమ వాదన వినిపించిన ఈ ఫార్మసీ లు మాత్రం... తమకు డ్రగ్స్ లైసెన్స్ అవసరమే లేదని వాదించాయి. ఎందుకంటే అసలు తాము మెడిసిన్ ను విక్రయించటం లేదని, కేవలం వాటిని డెలివరీ మాత్రం చేస్తున్నాయని వెల్లడించాయి. ఇందుకు ఫుడ్ డెలివరీ ఆప్ స్విగ్గి ని ఉదాహరించాయి. అన్ని వాదనలు విన్న కోర్ట్ పై విధంగా తీర్పు వెలువరించింది.
అమలు జరిగేనా...
గతంలో కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ ... ఈ ఫార్మసీ లు సెంట్రల్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ని ఉల్లంఘిస్తున్నాయని పేర్కొందని పిటిషనర్ ఆరోపించారు. అయినా దేశవ్యాప్తంగా లక్షల్లో మెడిసిన్ ఆన్లైన్ లో లభిస్తున్నాయని, ఇందులో నార్కోటిక్ డ్రగ్స్, సైకియాట్రిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయని తెలిపారు. యాంటీ బయోటిక్స్ అధికంగా వాడే అవకాశం ఉండటంతో రోగుల్లో వాటి రెసిస్టెన్స్ పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగా... కేంద్ర డ్రగ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలను ఇప్పటికైనా ఈ- ఫార్మసీ లు అమలు చేస్తాయా లేదా అన్నదానిని చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications