వెండి ధరలు ఈ రేటు వద్దకు వస్తే కొనుగోలు చేయండి.. సిల్వర్ ప్రియులకు కేడియా అడ్వైజరీ కీలక సూచన..
Silver Prices Under Pressure: అమెరికాలో అంచనాలను మించి నమోదైన బలమైన ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ (Fed) భవిష్యత్తులో వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే అంచనాలకు బలం చేకూర్చాయి. దీని ప్రభావంతో ప్రపంచ, దేశీయ మార్కెట్లలో వెండి ధరలపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొని ధరలు తగ్గాయి. కేడియా అడ్వైజరీ నివేదిక ప్రకారం.. యూఎస్ వినియోగదారుల ధరల సూచీ (CPI) అంచనా వేసిన 0.3% కంటే ఎక్కువగా 0.4% పెరిగింది. కోర్ సీపీఐ వరుసగా మూడవ నెలలోనూ 0.3% వృద్ధిని నమోదు చేసి మార్కెట్ అంచనాలను తలకిందులు చేసింది.
దీనికి తోడు అక్టోబర్ నెల ఉపాధి గణాంకాలు బలమైన ఉద్యోగ వృద్ధిని, నిరుద్యోగిత రేటు 4.1%కి పడిపోవడాన్ని సూచించాయి. ఈ పరిణామాలన్నీ డిసెంబర్ 8-9 తేదీలలో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చనే అంచనాలను మరింత బలపరిచాయి. మార్కెట్లో స్పెక్యులేటివ్ పొజిషనింగ్ కూడా బలహీనపడటంతో.. నవంబర్ 3తో ముగిసిన వారంలో నికర లాంగ్ పొజిషన్లు 238 కాంట్రాక్టులు తగ్గి 2,665కి పడిపోయాయి.

అధిక వడ్డీ రేట్ల వాతావరణం కారణంగా పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడంతో.. పెర్త్ మింట్ వెండి అమ్మకాలు సెప్టెంబర్‌లోని 605,408 ఔన్సుల నుండి అక్టోబర్‌లో ఏకంగా 36% తగ్గి 388,536 ఔన్సులకు పడిపోయాయి. స్వల్పకాలిక డిమాండ్‌పై ఆందోళనలు ఉన్నప్పటికీ.. లాంగ్‌టర్మ్‌లో మాత్రం ప్రపంచ వెండి మార్కెట్ 2026లో వరుసగా ఆరవ వార్షిక లోటును (Deficit) చవిచూడనుందని అంచనా వేస్తున్నారు. ఈ కొరత 2025లోని 40.3 మిలియన్ ఔన్సుల నుండి 2026 నాటికి 46.3 మిలియన్ ఔన్సులకు పెరుగుతుందని అంచనా. 2021 నుండి గ్లోబల్ నిల్వల నుండి దాదాపు 762 మిలియన్ ఔన్సులు తరలిపోవడం సరఫరా పరిమితులను స్పష్టం చేస్తోంది.
మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి 3% తగ్గి నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుండటంతో 2026లో మొత్తం వెండి డిమాండ్ 2% మేర తగ్గవచ్చని భావిస్తున్నారు. అయితే మెరుగుపడుతున్న యూఎస్ పెట్టుబడి డిమాండ్ కారణంగా నాణేలు, బార్ల డిమాండ్ మాత్రం 18% వరకు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి లండన్ వాల్ట్ నిల్వలు 1.95% పెరిగి 28,985 టన్నులకు చేరడం భౌతిక లభ్యత కొంత మెరుగైందనే సంకేతాన్ని ఇస్తోంది.
సాంకేతికంగా వెండి మార్కెట్లో కొత్తగా అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెన్ ఇంట్రెస్ట్ స్వల్పంగా 0.06% పెరిగి 17,021 కాంట్రాక్టులకు చేరగా.. ధరలు రూ. 4,551 మేర క్షీణించాయి. ఇది మార్కెట్లో అదనపు షార్ట్ పొజిషన్లు తయారవుతున్నాయనడానికి సంకేతం. ప్రస్తుతం వెండికి రూ. 181,120 వద్ద.. ఆ తర్వాత రూ. 179,650 వద్ద బలమైన మద్దతు (Support) లభిస్తోంది. ఒకవేళ పునరుద్ధరణ జరిగితే రూ. 185,180 వద్ద నిరోధకత (Resistance) ఎదురుకావచ్చని.. దీనిని దాటితే ధరలు రూ. 187,780 స్థాయిని తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
