వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. సిల్వర్ ధర భారీగా పతనమై ఈ రేటుకు దిగివస్తుందంటున్న మైక్ మెక్గ్లోన్..
Silver Price Forecast 2026: ఈసంవత్సరం ప్రారంభంలో అసాధారణ రీతిలో దూసుకెళ్లి.. ఔన్సుకు $120 పైకి చేరిన వెండి ధరలు ఇప్పుడు భారీ కరెక్షన్కు లోనవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు సుమారు $59.11 వద్ద ట్రేడవుతుండగా.. బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ కమోడిటీ నిపుణుడు మైక్ మెక్గ్లోన్ (Mike McGlone) వెండి ధరలు మరింత పడిపోయి ఔన్సుకు $50 స్థాయిని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. 1980ల నాటి చారిత్రక పరిణామాలను తలపించేలా ప్రస్తుతం వెండిలో భారీ అస్థిరత (Volatility) నెలకొనడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా వెండి ధర ప్రస్తుత $59.11 నుండి $50కి పడిపోతే.. అది సుమారు 15.4% తగ్గుదలను సూచిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం కిలోగ్రాము వెండి ధర సుమారు రూ. 2.20 లక్షలుగా అంచనా వేస్తే.. ఈ 15.4% పతనం ప్రకారం కిలో ధర సుమారు రూ. 1.86 లక్షలకు (సుమారు రూ. 34,000 తగ్గుదల) పడిపోయే అవకాశం ఉంది. అయితే, దిగుమతి సుంకాలు, జీఎస్టీ, కరెన్సీ మారకం విలువలు (USD/INR), స్థానిక ప్రీమియంల కారణంగా భౌతిక మార్కెట్ ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉందని మైక్ మెక్గ్లోన్ అంచనా వేస్తున్నారు.

గత 260 ట్రేడింగ్ రోజుల్లో వెండి ధరల అస్థిరత S&P 500 సూచీ కంటే ఏకంగా 5.1 రెట్లు ఎక్కువగా ఉందని.. ఇది 1980 తర్వాత అత్యధికమని మెక్గ్లోన్ పేర్కొన్నారు. గత సంవత్సరంలో వెండి ధర దాని 10 సంవత్సరాల దీర్ఘకాలిక సగటు (ఔన్సుకు సుమారు $31) కంటే 2.7 రెట్లు ఎక్కువగా ఎగబాకింది. ఆర్థిక సూత్రాల ప్రకారం.. ధరలు ఈ విధంగా అతిగా పెరిగినప్పుడు తిరిగి తమ దీర్ఘకాలిక సగటు స్థాయికి సర్దుబాటు కావడాన్ని 'మీన్ రివర్షన్' అంటారు.
వెండి ధర పతనమయ్యే క్రమంలో 50 డాలర్లు అనేది మొదటి బలమైన 'సపోర్ట్' (మద్దతు) స్థాయిగా నిలవనుంది. ధర ఈ వద్ద నిలదొడితే కొనుగోలుదారుల విశ్వాసం తిరిగి పుంజుకోవచ్చు. అయితే, వెండిపై మార్కెట్ పూర్తిగా బుల్లిష్గా మారాలంటే దాని ధర ఔన్సుకు 84 డాలర్ల పైకి చేరి అక్కడ స్థిరపడాలని.. అందుకు ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 42 శాతం పెరుగుదల అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వెండితో పాటు బంగారం కూడా ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదముంది. ఐదేళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్ రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయిలో ఉండటం ఇందుకు ప్రధాన కారణం. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఎలాంటి వడ్డీని చెల్లించవు. కాబట్టి బాండ్ల ద్వారా అధిక రాబడులు లభిస్తున్న తరుణంలో.. మదుపర్లు తమ నిధులను బాండ్ల వైపు మళ్లించే అవకాశం ఉంది. ఇది పసిడి ధరలపై అదనపు ఒత్తిడిని తెస్తుంది.
ఏది ఏమైనా.. వెండి ధరలు స్వల్పకాలంలో 'కన్సాలిడేషన్' (స్థిరీకరణ) దశను ఎదుర్కొంటున్నాయి. ధరలు పడిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. కాబట్టి ఇన్వెస్టర్లు కేవలం ఒక నిపుణుడి విశ్లేషణను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా.. తమ స్వంత ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం (Risk Appetite) ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
