వెండి మార్కెట్‌లో కలకలం.. సిల్వర్ ETF ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు.. 50 శాతానికి పైగా పతనమైన సిల్వర్ ఫండ్స్..

Silver Price Crash Hits ETFs: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడిదుడుకులు దేశీయ సిల్వర్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (Silver ETFs) పై తీవ్ర ప్రభావం చూపాయి. మదుపర్లు తమ పొజిషన్లను విక్రయించుకోవడానికి మొగ్గు చూపడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సిల్వర్ ఈటీఎఫ్‌లు ఏకంగా 5 శాతం వరకు కుప్పకూలాయి. ఈ తాజా పతనంతో.. ఈ ఏడాది జనవరి 29న నమోదైన చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిల నుండి వీటి నష్టాలు 50 శాతానికి పైగా.. కొన్ని ఫండ్లలో ఏకంగా 54 శాతం మేర నమోదయ్యాయి.

అమెరికా డాలర్ బలోపేతం కావడం, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు వెండి ధరలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. దీనికి తోడు దేశీయంగా రూపాయి విలువ కొంత బలపడటం, పారిశ్రామిక డిమాండ్ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం ఈ పతనాన్ని మరింత వేగవంతం చేసింది.

Silver ETF crash Nippon India Silver ETF HDFC Silver ETF ICICI Prudential Silver ETF silver price crash 2026 silver ETF losses silver prices today silver 50 fall Fed rate hike US dollar strength silver demand silver investment precious metals market ETF ETF HDFC ETF ICICI ETF ETF 50

సోమవారం మార్కెట్లో ప్రధాన సిల్వర్ ఈటీఎఫ్‌ల పనితీరును పరిశీలిస్తే.. నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ నికర ఆస్తి విలువ (NAV) 4.65 శాతం క్షీణించి రూ. 160.94 వద్ద ట్రేడవుతోంది. దీని ఇండికేటివ్ ఎన్ఏవీ (iNAV) అయిన రూ. 232.80తో పోలిస్తే ఇది 31 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. అదేవిధంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ 4.6 శాతం పడిపోయి రూ. 167.81 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్ ఈటీఎఫ్ 4.66 శాతం నష్టపోయి రూ. 160.87 వద్ద కోట్ అయ్యాయి.

Also Read

ఇక యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 4.55 శాతం తగ్గి రూ. 162.47 వద్ద నిలవగా.. ఎస్‌బీఐ సిల్వర్ ఈటీఎఫ్ అత్యధికంగా 4.75 శాతం పతనమై రూ. 165.38 వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) సుమారు 81కి చేరుకోవడం, తాజా అమ్మకాల ఒత్తిడిలో బంగారంతో పోలిస్తే వెండి అత్యంత బలహీనంగా మారిందని స్పష్టం చేస్తోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సైతం వెండి ఫ్యూచర్స్ సోమవారం ఉదయం సుమారు రూ. 1,72,400 వద్ద భారీ గ్యాప్ డౌన్‌తో ప్రారంభమై, దాదాపు 2.9 శాతం క్షీణించి కిలో రూ. 1,71,150 వద్ద ట్రేడయ్యాయి. పెరిగిన బాండ్ దిగుబడులు మరియు బలమైన డాలర్ కారణంగా వెండిలో సమీపకాల ధోరణి ప్రతికూలంగానే ఉందని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ విశ్లేషించారు.

సాంకేతికంగా చూస్తే.. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 26 సమీపంలో కదులుతూ తీవ్రమైన "ఓవర్‌సోల్డ్" (Oversold) స్థితిని సూచిస్తున్నప్పటికీ, ఏదైనా సాంకేతిక పునరుద్ధరణ ఊపందుకోవాలంటే ధర ముందుగా రూ. 1,72,000 మార్కును తిరిగి అందుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ధరలు స్థిరపడాలంటే కిలోకు రూ. 1,78,000 పైన నిలకడగా కొనసాగడం అవసరమని, ఒకవేళ రూ. 1,70,000 కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడిపోతే అది రూ. 1,64,000 వైపు పతనాన్ని మరింత వేగవంతం చేయవచ్చని హెచ్చరించారు.

ఇక రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్ వార్ష్ చేయనున్న వ్యాఖ్యలు, బుధవారం విడుదల కానున్న ఎఫ్ఓఎంసీ (FOMC) సమావేశపు మినిట్స్ విలువైన లోహాల గమనాన్ని నిర్దేశించనున్నాయని పీఎల్ క్యాపిటల్ కమోడిటీస్ హెడ్ ఆశిష్ రాజోడియా తెలిపారు. ఫెడ్ కఠిన వైఖరిని కొనసాగిస్తే పతనం మరింత పొడిగించబడే అవకాశం ఉందని.. అయితే డిసెంబర్ తర్వాత వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇస్తామనే సంకేతాలు వెలువడితే మాత్రం బంగారం, వెండి ధరలు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+