వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ధోరణులు, మదుపర్ల నుండి ఎదురైన తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా సోమవారం వెండి ధరలు ఊహించని రీతిలో కుప్పకూలాయి. మార్చి 23, 2026న భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు ఏకంగా లోయర్ సర్క్యూట్‌ను తాకడం బులియన్ రంగంలో పెను సంచలనంగా మారింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మే నెల డెలివరీకి సంబంధించిన వెండి ఒప్పందాలు కేవలం ఒక్క రోజులోనే కిలోగ్రాముకు రూ. 20,409 (సుమారు 9 శాతం)మేర పడిపోయి..రూ. 2,06,363 వద్ద స్థిరపడ్డాయి. Silver ధరలు ఇంత వేగంగా పతనమవ్వడంతో ట్రేడింగ్ నిబంధనల ప్రకారం లోయర్ సర్క్యూట్ అమలై అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నప్పటికీ.. సురక్షిత ఆస్తిగా వెండికి మద్దతు లభించకపోగా ఇతర ఆర్థిక ఒత్తిళ్లు ధరలను కిందికి లాగాయి. బలమైన అమెరికన్ డాలర్, పెరుగుతున్న ట్రెజరీ బాండ్ దిగుబడులు వెండి వంటి వడ్డీ లేని ఆస్తుల ఆకర్షణను తగ్గించాయి. డాలర్ విలువ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులకు ఈ లోహాలు మరింత ఖరీదైనవిగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్ (COMEX)లో కూడా మే నెల వెండి ఫ్యూచర్స్ ఔన్సుకు 9.34 శాతం (6.51 డాలర్)తగ్గి 63.15 డాలర్ల వద్దకు పడిపోయింది.
ఈ భారీ పతనానికి ద్రవ్య అవసరాలు కూడా ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్, ఇతర రంగాలలో వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి పెట్టుబడిదారులు వెండిలో ఉన్న తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు చమురు ధరలు విపరీతంగా పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేస్తాయనే అంచనాలు వెండిపై మరింత ఒత్తిడిని పెంచాయి.
వెండికి ఉండే పారిశ్రామిక డిమాండ్ (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో) కూడా గ్లోబల్ స్లోడౌన్ భయాల వల్ల తగ్గిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే చెప్పాలంటే.. ప్రస్తుతానికి యుద్ధం కంటే స్థూల ఆర్థిక ఒత్తిళ్లే Silver ధరలను శాసిస్తున్నాయి. డాలర్ బలం, వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత వచ్చే వరకు మార్కెట్‌లో ఈ అస్థిరత కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications