బంగారం, వెండి ధరలు భారీగా బ్లాస్ట్ కాబోతున్నాయి.. పవర్ పుల్ బాంబు పేల్చిన రాబర్ట్ కియోసాకి..

ప్రపంచ ఆర్థిక రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒకవైపు స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగు తీస్తుంటే.. మరోవైపు ప్రపంచాన్ని ఒక భారీ ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టబోతోందనే భయాలు ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ బిలియనీర్, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కమోడిటీస్ మార్కెట్ (బంగారం, వెండి) పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి.

రాబోయే రోజుల్లో మార్కెట్లు తక్షణమే కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆయన మే 23, 2026 (శనివారం) నాడు సామాజిక మాధ్యమం 'X' (ట్విటర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. భవిష్యత్తులో వెండి ధరలు ఊహించని రీతిలో ఔన్సుకు ఏకంగా $200 (భారత కరెన్సీలో కిలోగ్రాముకు దాదాపు రూ. 6.75 లక్షలు)కు పెరగవచ్చని Kiyosaki అంచనా వేశారు.

gold and silver prices Robert Kiyosaki gold price prediction silver price prediction gold and silver rally precious metals outlook gold investment silver investment gold market forecast silver market forecast safe haven assets gold and silver news Kiyosaki gold prediction Kiyosaki silver prediction global economic crisis inflation hedge bullion market news gold and silver boom wealth creation assets precious metals investment

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ చేసిన పరిశోధనలను ఉటంకిస్తూ కియోసాకి ఈ విశ్లేషణను పంచుకున్నారు. "ప్రస్తుతం మార్కెట్ పతనం చాలా ఆసన్నమైంది. ఈ సంక్షోభం కారణంగా భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా $100,000 మార్కును తాకవచ్చని జిమ్ రిచర్డ్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర $4,500 వద్ద ఉంది. అలాగే ప్రస్తుతం $75 వద్ద ఉన్న వెండి ధర.. రాబోయే రోజుల్లో ఔన్సుకు $200 కి చేరుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను" అని కియోసాకి తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

సాధారణంగా మార్కెట్లు పడిపోయినప్పుడు సామాన్య పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే, భవిష్యత్ ధోరణులను, మార్కెట్ కదలికలను ముందుగానే ఊహించి, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగే స్మార్ట్ ఇన్వెస్టర్లు ఈ గందరగోళ సమయంలోనే మరింత సంపన్నులు అయ్యే అవకాశం ఉందని కియోసాకి అభిప్రాయపడ్డారు.

Also Read

ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును ముందుగానే చూడగలరు, దానికి తగ్గట్టుగా ముందే చర్యలు తీసుకోగలుగుతారు. రాబోయే ఈ మార్కెట్ పతనంలో మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. దీనిని ఒక అవకాశంగా మార్చుకుని మీరు మరింత ధనవంతులు కావచ్చు" అంటూ ఆయన ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

కియోసాకి భవిష్యత్తుపై భారీ అంచనాలు వేస్తున్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్లో మాత్రం వెండి ధరలపై స్వల్ప ఒత్తిడి కనిపిస్తోంది. గడిచిన శుక్రవారం నాడు వ్యాపారులు తమ పందాలను (Bets) తగ్గించుకోవడంతో దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు కిలోగ్రాముకు రూ.1,883 మేర తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) జూలై డెలివరీకి సంబంధించిన వెండి కాంట్రాక్టులు 0.69 శాతం తగ్గి రూ. 2,73,000 వద్ద ముగిశాయి.

మార్కెట్లో ప్రధాన కొనుగోలుదారులు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు జరపడమే ఈ తాత్కాలిక ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, న్యూయార్క్ మార్కెట్లో వెండి ప్రస్తుతం 0.53 శాతం తగ్గి ఔన్సుకు $76.26 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత ధరలతో పోలిస్తే కియోసాకి చెప్పిన $200 మార్కు చాలా పెద్దది కావడంతో, రాబోయే రోజుల్లో బంగారం, వెండి మార్కెట్ ఏ వైపు అడుగులు వేస్తుందో చూడాలి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+