For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జొమాటో అదరగొడుతుంది, షేర్ టార్గెట్ ధర రూ.100

|

జొమాటో షేర్లు నిన్నటి ప్రారంభ సెషన్‌లో భారీగా క్షీణించాయి. ఆ తర్వాత మాత్రం లాభాల్లోకి వచ్చింది. ఈ రోజు(మే 24, మంగళవారం) మధ్యాహ్నం గం.12.30 సమయానికి జొమాటో షేర్ వ్యాల్యూ దాదాపు పదమూడు శాతం ఎగిసిపడింది. రూ.7.05 లాభపడి రూ.64.15 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ గత ఐదు సెషన్‌లలో 10 శాతం ఎగిసిపడింది. కానీ నెల రోజుల్లో మాత్రం దాదాపు 19 శాతం క్షీణించింది. 2022 క్యాలెండర్ ఏడాదిలో 55 శాతం మేర క్షీణించింది.

జొమాటో షేర్ వ్యాల్యూ 52 వారాల గరిష్టం రూ.169 కాగా, 52 వారాల కనిష్టం రూ.50. ఇది లిస్టింగ్ అయినప్పటి నుండి దాదాపు సగం పతనమైంది. ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ జోమాటోకు వరుస నష్టాల షాక్ తగిలింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి - మార్చి త్రైమాసికంలో నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ.360 కోట్లకు చేరుకుంది.

Zomato rallies most since listing, up 19%

అంతకుముందు ఏడాది అదే కాలంలో రూ.134 కోట్ల నష్టం నమోదు చేసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.692 కోట్ల నుండి రూ.1212 కోట్లకు పెరిగింది. అయితే మొత్తం వ్యయాలు రూ.885 కోట్ల నుండి రూ.1702 కోట్లకు పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జొమాటో నికర నష్టం భారీగా పెరిగి రూ.1225 కోట్లు దాటింది. అయితే ఈ షేర్ వ్యాల్యూ ప్రస్తుతం రూ.64 వద్ద ఉందని, అయితే ట్రేడ్ నిపుణులు టార్గెట్ ధరను రూ.100గా నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో జొమాటో షేర్ల కొనుగోలు పుంజుకుంది. జొమాటో షేర్ లిస్టింగ్ తర్వాత మొదటిసారి దాదాపు 20 శాతం మేర ఎగిసింది. అయితే ఆ తర్వాత 12 శాతం లాభానికి వచ్చింది.

English summary

జొమాటో అదరగొడుతుంది, షేర్ టార్గెట్ ధర రూ.100 | Zomato rallies most since listing, up 19%

Shares of Zomato rallied more than 19 per cent in early trade on Tuesday after the company announced its earnings for the March 2022 quarter.
Story first published: Tuesday, May 24, 2022, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X