బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ FDలో పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీ ద్వారా అధిక రాబడిని ఆశించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లకుండానే నేరుగా ఆన్ లైన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. సంపాదన ప్రారంభమైనప్పటి నుండే పొదుపు పైన దృష్టి సారించడం మంచిది. అలా అయితే మీ రిటైర్మెంట్ సమయానికి లేదా మీ టార్గెట్ రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది.
పెట్టుబడి పెట్టడానికి అనేక పథకాలు ఉన్నాయి. అయితే తక్కువ రిస్క్ కలిగిన స్కీమ్స్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. ఇలా కచ్చితమైన రాబడిని ఇచ్చే వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. బజాజ్ ఫైనాన్స్ ఆన్ లైన్ FDలో పెట్టుబడి పెట్టవచ్చునని సూచిస్తున్నారు. ఈ డిపాజిట్స్ పైన సీనియర్ సిటిజన్స్ బేస్ రేటు 0.25 శాతం అదనంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుదారుకు 0.10 శాతం అదనపు వడ్డీ రేటు ఉంటుంది.

ఫిక్స్డ్ డిపాజిట్ పైన బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ FDపై మూడేళ్ల కాలపరిమితిపై 6.60 శాతం వడ్డీ రేటు వస్తుంది. రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 6.6 శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత రూ.6.05 లక్షలు వస్తుంది. అదే సమయంలో పోస్టాఫీస్ FDలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ల తర్వాత 5.5 శాతం వడ్డీ రేటుతో రూ.5.89 లక్షలు, బ్యాంకు FDపై అదే కాలానికి 5 శాతం వడ్డీతో రూ.5.80 లక్షలు వస్తుంది. అంటే ఈ కాలపరిమితిలో బ్యాంకు FDలో వచ్చే వడ్డీ రూ.80వేలు, పోస్టాఫీస్ FDలో రూ.89 వేలు, బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ FDలో రూ.1.05 వడ్డీ అందుతుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications