దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలతో సేవింగ్స్ అలాగే సాలరీ అకౌంట్స్ అందిస్తోంది. మీరు SBIలో సాలరీ అకౌంట్ తెరిస్తే చాల రకాల సౌకర్యాలు ఇంకా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సాలరీ అకౌంట్స్
ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డిఫెన్స్ ఫోర్సెస్, పారామిలిటరీ బలగాలు, పోలీసు బలగాలు, కార్పొరేట్/సంస్థలు మొదలైన వారికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా అధునాతన అలాగే సురక్షితమైన నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఆక్సెస్‌ను అందిస్తుంది. అయితే SBIలో సాలరీ అకౌంట్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసా...
ఏదైనా బ్యాంక్ ATM నుండి ఆన్ లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సక్షన్స్
SBI అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం, SBI సాలరీ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్. భారతదేశంలోని ఏదైనా బ్యాంక్ ATM నుండి ఆన్ లిమిటెడ్ ట్రాన్సక్షన్స్ పూర్తిగా ఉచితం. ఇంకా కస్టమర్ రూ. 40 లక్షల వరకు ఫ్రీ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ (మరణిస్తే) కవర్‌ను పొందుతారు. అంతేకాకుండా రూ. 1 కోటి వరకు ఉచిత విమాన ప్రమాద బీమా (మరణిస్తే) కవర్ కూడా అందిస్తుంది. ఇవి కాకుండా, మీరు ఆకర్షణీయమైన రేట్లలో పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ అలాగే ఎడ్యుకేషన్ లోన్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఈ సేవలు కూడా పూర్తిగా ఉచితం
SBI సాలరీ అకౌంట్ కస్టమర్లకు అన్యువల్ లాకర్ రెంట్ పై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు e-MOD (మల్టీ ఆప్షన్ డిపాజిట్) చేయడానికి ఇంకా అధిక వడ్డీని సంపాదించడానికి ఆటో-స్వైప్ ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనికి తోడు ఆన్-బోర్డింగ్ సమయంలో డీమ్యాట్ అండ్ ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి మాత్రమే కాకుండా మీరు డ్రాఫ్ట్‌లు, మల్టీ సిటీ చెక్‌లు, SMS అలర్ట్‌లను ఉచితంగా కొనసాగించవచ్చు. మీరు ఉచితంగా NEFT/RTGS ద్వారా ఆన్‌లైన్‌లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. లాయల్టీ ప్రోగ్రామ్ SBI రివార్డ్స్ ద్వారా చేసే వివిధ ట్రాన్సక్షన్స్ పై పాయింట్స్ సంపాదించవచ్చు. మీరు డెబిట్ కార్డ్ ఇంకా యోనో యాప్‌పై SBI అందించే రెగ్యులర్ ఆఫర్ ప్రయోజనాలన్ని కూడా పొందవచ్చు.
ఇవి గుర్తుంచుకోండి
వరుసగా మూడు నెలలకు మించి ప్రతినెల జీతం మీ సాలరీ అకౌంట్లో పడకపోతే అకౌంట్ సాధారణ సేవింగ్స్ అకౌంట్ కి మారుతుంది. ఇంకా సాలరీ అకౌంట్ కింద అందించే అన్ని సౌకర్యాలు కట్ అవుతాయి. అలాగే, సాధారణ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రకారం అన్ని ఛార్జీలు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications