ఈ రోజుల్లో జీతం కాకూండా ఇతర పార్ట్ టైం జాబులు చూస్తూ కూడా సంపాదిస్తున్నారు. మరొకొందరు జీతంలో కొంత మరేదైనా దాంట్లో పెట్టుబడి పెట్టి డబ్బులు పొందుతుంటారు. అయితే మీ పెట్టుబడిపై డబుల్ గ్యారంటీ ఇవ్వకపోయినా మంచి రాబడిని ఇచ్చే కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి.
ప్రతిఒక్కరు అలాగే ఉద్యోగస్తులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు వృద్ధాప్యాన్ని భార్యలతో హాయిగా గడపడానికి ముందస్తు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్స్ చేస్తుంటారు. మీరు కూడా ఇలా ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు నుండే మీ భార్యతో లేదా మీ భార్య పేరు మీద పెట్టుబడి పెట్టడం ప్లాన్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పెట్టుబడి అప్షన్స్ ఉన్నాయి, అందులో ప్రత్యేకంగా వీటిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా డబుల్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే మీ భార్యతో కలిసి లేదా మీ భార్య పేరు మీద ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చో తెలుసా.....

మ్యూచువల్ ఫండ్స్
మీరు మీ భార్య పేరు మీద మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టవచ్చు. 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.12,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు దానిపై సుమారు 12 శాతం అన్యువల్ రాబడిని అంచనా వేస్తే మీ భార్య 20 సంవత్సరాలలో కోటి రూపాయల కంటే ఎక్కువ రాబడిని పొందుతుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఈ స్కిం మహిళలకు మంచి పెట్టుబడి అప్షనుగా పరిగణించవచ్చు. ఇందులో మీరు మీ భార్య పేరు మీద రెండేళ్లపాటు పెట్టుబడి పెట్టండి. ప్రతి సంవత్సరం 7.5 శాతం రాబడిని పొందవచ్చు.మీరు రూ.1000 నుండి 32 లక్షల వరకు ఎంతైనా ఇన్వెస్ట్ చేయోచ్చు.
పోస్టాఫీసు మంథ్లి ఇన్ కమింగ్ స్కిం
బ్యాంకులు, స్టాక్ మార్కెట్ కాకుండా భార్య పేరు మీద లేదా భార్యతో మంథ్లి ఇన్ కమింగ్ స్కిం MISలో పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. విశేషమేమిటంటే ఈ స్కింలో 7.4 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. భార్య పేరు మీద అకౌంట్ తెరిచి రూ.9,00,000 అకౌంట్లో జమ చేయవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్లో అతధికంగా రూ. 15,00,000 డిపాజిట్ చేయవచ్చు. మీరు మీ భార్యతో జాయింట్ అకౌంట్‌పై ఎక్కువ వడ్డీని పొందుతారు.
జాయింట్ హోమ్ లోన్
మీరు మీ భార్యతో కలిసి జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మీకు డబల్ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో మీరు, మీ భార్య ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు, అయితే హోమ్ లోన్ కట్టే కస్టమర్లు ఇద్దరూ ఆ ఆస్తికి యజమానులు అయి ఉండాలి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications