ఇళ్లు కొనేవారికి యస్ బ్యాంకు బంపరాఫర్, మహిళలకు అయితే మరింత బెనిఫిట్
ప్రయివేటురంగ బ్యాంక్ యస్ బ్యాంకు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించింది. పండుగ సమయంలో ఫెస్టివ్ ఆఫర్ ఇచ్చింది. పరిమిత కాలానికి గాను వడ్డీ రేటును 6.7 శాతంగా పేర్కొంది. యస్ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.95 శాతం నుండి 11.80 శాతం మధ్య ఉన్నాయి. రిటైల్ కన్స్యూమర్ మార్కెట్‌లో అత్యంత పోటీతత్వ వడ్డీ రేటును హోమ్ లోన్స్ పైన ప్రకటించినట్లు బ్యాంకు తెలిపింది.
ప్రాస్పెక్టివ్ శాలరీ వుమెన్‌కు ఇంటి కొనుగోలు కోసం బ్యాంకు 90 రోజుల ఆఫర్‌తో అదనంగా 0.05 శాతం బోనస్ వడ్డీ రేటును అందిస్తోంది. అంటే వీరికి 6.65 శాతం వడ్డీ రేటు మాత్రమే ఉంటుంది. 6.7 శాతం తగ్గింపు వడ్డీ రేటు పరిమిత కాలం అంటే 90 రోజులు అమలులో ఉంటుందని వెల్లడించింది.

బ్యాలెన్స్ బదలీకి వర్తిస్తుంది
35 ఏళ్ల కాలపరిమితితో తక్కువ ఈఎంఐ ప్రత్యామ్నాయం, మినిమం డాక్యుమెంటేషన్, నో-ప్రీపేమెంట పెనాల్టీ వంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు యస్ బ్యాంకు తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఇళ్లు, రిటైల్ రుణాల బుక్ రెండురెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 35 ఏళ్ల కాలపరిమితిపై హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గి, ఈఎంఐ తగ్గుతుందని శాలరైడ్ హోమ్ బయ్యర్స్‌కు ఇది ప్రయోజనకరమని పేర్కొంది. ఈ ఆఫర్ కొత్త, పాత రుణ గ్రహీతలకు అందుబాటులో ఉంటుందని, బ్యాలెన్స్ బదలీకి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది.

ఇంటి కొనుగోలుపై వడ్డీరేటు
భారత దిగ్గజ బ్యాంకులు ప్రస్తుతం వడ్డీరేటును పదేళ్ల కనిష్టానికి తగ్గించాయి. దీనికి తోడు హోమ్ బిల్డర్స్ ఇళ్లను, ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా రియాల్టీ దిగ్గజం కుదేలయింది. గత కొద్ది రోజులుగా కోలుకుంటోంది. ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమైంది.
దీంతో ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకొని, డిమాండ్‌ను పెంపొందించేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఆఫర్లు ఇవ్వడం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వివిధ కారణాలతో సొంతిళ్లకు డిమాండ్ వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నందున విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. డిమాండ్‌ను మరింత పెంచేలా బ్యాంకులు, హోమ్ బిల్డర్స్ ప్రత్యేక వడ్డీ రేటు తగ్గింపు, ఆఫర్లు ఇస్తున్నారు.

బ్యాంకుల వడ్డీ రేటు తగ్గింపు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పండుగ సందర్భంగా వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల నుండి 60 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాయి. దీంతో ప్రారంభ వడ్డీ రేటు ఏకంగా 6.5 శాతం నుండి 6.7 శాతం స్థాయికి పడిపోయింది. దశాబ్ద కాలంలో కనిష్ట వడ్డీ రేటు. కరోనా కారణంగా బ్యాంకుల బ్యాడ్ లోన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు సెక్యూర్డ్ రుణాల కేటగిరీని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్బీఐ పెద్ద మొత్తంలో నగదును ఇండక్ట్ చేసిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి.


Click it and Unblock the Notifications