Fixed Deposit: గత కొన్ని నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూపోవటం వల్ల చిన్న పొదుపరులకు లాభదాయకంగా మారింది. గతంలో పొందుతున్న వడ్డీ కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు డిపాజిటర్లకు ఇదొక జాక్‌పాట్ అని చెప్పుకోవచ్చు.

యస్ బ్యాంక్..
ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ అక్టోబర్ 12 నుంచి కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పిక్సెట్ డిపాజిట్ స్కీమ్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న పిక్సెట్ డిపాజిటర్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 6.75% వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల విషయంలో బ్యాంక్ 7.50% వడ్డీని అందిస్తున్నట్లు ప్రకటించింది.

స్పెషల్ వడ్డీ రేటు..
రిజర్వు బ్యాంక్ రేట్లను సవరించిన ప్రతిసారీ బ్యాంకులు ఎఫ్డీ రేట్లలో మార్పులు ప్రకటించటం మనం ఇప్పుటి వరకు చూశాం. అయితే తాజాగా యెస్ బ్యాంక్ తెచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ మాత్రం 20 నుంచి 22 నెలల కాలపరిమితిని కలిగి ఉంటుంది. ఈ పథకంలో డబ్బు పొదుపు చేసుకునే సాధారణ కస్టమర్లకు 7.25% వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75% వడ్డీని చెల్లిస్తామని బ్యాంక్ తెలిపింది.

తాజా వడ్డీ రేట్ల వివరాలు..
7-14 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25%
15-45 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.70%
46-90 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.10%
3-6 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75%
6-9 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50%
9-12 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75%
12-18 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25%
18-120 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75%

సీనియర్ సిటిజన్లకు ఆసక్తి..
యెస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 7 రోజుల నుంచి 36 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే పెట్టుబడులపై 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. దీనికి తోడు 36 నెలల నుంచి 120 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే పెట్టుబడి డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందించటం చాలా మంది సీనియర్ సిటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ సమయంలో రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతున్న సమయంలో ఈ పెరిగిన రేట్లు మరింత లాభాన్ని అందిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications