డిసెంబర్ 1 నుంచి ఆ సేవలు నిలిపివేయనున్న ప్రైవేట్ బ్యాంక్.. ఎందుకంటే..
డిసెంబర్ 1 నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. వాటిలో తాజాగా ఈ బ్యాంకింగ్ వార్త కూడా చేరుకుంది. ప్రైవేటు రంగంలో సేవలు అందిస్తున్న బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ కస్టమర్లకు ఒక సేవ నిలిపివేతపై ప్రకటన చేసింది.
సబ్‌స్క్రిప్షన్ ఆధారిత SMS బ్యాలెన్స్ అలర్ట్ ఫెసిలిటీకి సంబంధించిన సేవలు ఇకపై నిలిచిపోనున్నట్లు యెస్ బ్యాంక్ వెల్లడించింది. అంటే కస్టమర్లు డిసెంబర్ 1, 2022 తర్వాత ఎస్ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ సదుపాయాన్ని పొందలేరు. అయితే రెగ్యులేటరీ నిర్ధేశించిన అలర్ట్స్ మాత్రం అందించటాన్ని కొనసాగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

అయితే వినియోగదారులు తమ బ్యాలెన్స్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకునేందుకు YES మొబైల్, YES ఆన్‌లైన్, YES రోబోట్ వంటి ఆన్‌లైన్ సౌకర్యాలను ఉపయోగించవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అయితే అలర్ట్స్ విషయంలో కస్టమైజేషన్ ఫెసిలిటీని బ్యాంక్ తన ఖాతాదారులకు అందిస్తోంది.
అలర్ట్స్ కస్టమైజేషన్ ఆన్‌లైన్ ప్రక్రియ..
Step 1: మీ కస్టమర్ ID, పాస్‌వర్డ్‌తో YES ఆన్‌లైన్‌కి లాగిన్ అవ్వండి
Step 2: పేజీ ఎడమవైపు పైన మూలలో ఉన్న "మెనూ"పై క్లిక్ చేయండి
Step 3: "ప్రొఫైల్‌ని నిర్వహించు"పై క్లిక్ చేసి ఆపై "అలర్ట్‌లు"పై క్లిక్ చేయండి
Step 4: మీరు హెచ్చరికలను సవరించాలనుకునే , రిజిస్టర్ లేదా డీ-రిజిస్టర్ చేయాలనుకుంటున్న ఖాతా రకాన్ని ఎంచుకోండి
Step 5: ఆ తర్వాత చేయాలనుకున్న హెచ్చరికల రకాన్ని ఎంచుకోండి
Step 6: హెచ్చరికలను ఎంచుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది


Click it and Unblock the Notifications