ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిపై ఆందోళన చెందుతున్నారా?
స్టాక్ మార్కెట్‌లోని అస్థిరత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లను, ముఖ్యంగా మార్కెట్లోకి వచ్చే కొత్త పెట్టుబడిదారుల్ని భయపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పుతిన్ దూకుడు, టైటర్ లిక్విడిటీ.. వంటి అంశాలు మార్కెట్ అనిశ్చితులకు కారణంగా కనిపిస్తున్నాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ అస్థిరతను అంచనా వేయలేరు.. దానిని నివారించలేం. అయితే దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడం మాత్రం కాస్త సురక్షితమని చెప్పవచ్చు.

మార్కెట్‌ను మరింత అర్థం చేసుకోండి
మార్కెట్‌లో తీవ్ర ఆస్థిరత కారణంగా మీ పెట్టుబడుల గురించి ఆందోళనతో మీకు నిద్రపట్టడం లేదా? మార్కెట్‌ను మరింత అర్థం చేసుకోవడానికి మీరు ఎంతో చదవాలి. మీరు కొత్త పాడ్‌కాస్ట్‌లను చూడవచ్చు లేదా మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవవచ్చు. టీవీలో మీకు ఇష్టమైన మార్కెట్ పండితులను గమనించండి. ఏది ఏమైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి బలమైన మానసిక స్థితి అవసరం. ఎందుకంటే స్టాక్స్ పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.

వారి సలహాలు ఉపయోగపడ్డాయా?
మీ ఆందోళనల గురించి మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ లేదా ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడవచ్చు. మీ భావోద్వేగాలపై పట్టు సాధించేందుకు మీ ఫండ్ అడ్వైజర్ లైదా ఫైనాన్షియల్ ప్లానర్ సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడ్డాయా? మీరు డూ ఇట్ యువర్ సేల్ఫ్(DIY) ఇన్వెస్టర్ అయితే మీరు వీటి గురించి లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. మీరు సహకారం తీసుకోవడానికి మీ ఫేవరేట్ ఫోరమ్స్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను సందర్శించాలి.

ఆ పెట్టుబడులను పునఃపరిశీలించండి
ఈక్విటీలో పెట్టుబడులకు సంబంధించి మీరు చాలాకాలం పాటు అసహనం లేదా ఆందోళనతో ఉంటే కనుక మీ పెట్టుబడులను పునఃపరిశీలించవలసి ఉంటుంది. ఏదైనా నిర్దిష్ట ఈక్విటీ పెట్టుబడి మీకు ఆకర్షణీయంగా కనిపిస్తుందా చూసుకోవాలి. ఉదాహరణకు కొంతమంది పెట్టుబడిదారులు స్మాల్, మిడ్ క్యాప్ స్కీమ్‌లలో పెట్టుబడుల గురించి ఆందోళన చెందుతుంటారు. మరికొందరు ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో పెట్టుబడిపై ఆందోళన చెందుతారు. మీకు ఇబ్బంది కలిగించే వాటిని గుర్తించడం, సమస్యలను పరిష్కరించుకోవడం మంచి ఆలోచన.

అప్పుడు పెట్టుబడుల్ని నిలిపివేయవచ్చు
పెట్టుబడులకు కొనసాగించడం ద్వారా మీకు ఏ ప్రయోజనం కలిగినట్లుగా కనిపించకుంటే మీరు మీ పెట్టుబడులను నిలిపివేయడం మంచిది. అయితే దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన పెట్టుబడులను మాత్రం కొనసాగించడమే మంచిది. ఇక్కడ మరో అంశం.. ఆ రంగం లేదా స్టాక్ గురించి పూర్తి అవగాహన అవసరం. అప్పుడే దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న అంశం.


Click it and Unblock the Notifications