బీమా సఖి యోజన: ఇంట్లో కూర్చొనే సంపాదించొచ్చు.. మహిళలకు నెలకి రూ. 21 వేల వరకు..
భారత ప్రభుత్వం దేశంలో ఎన్నో కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది. అలాగే ఇప్పుడు మరో కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. డిసెంబర్ 9న బీమా సఖీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మహిళలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ అని పిలుస్తారు, ఈ పథకం కింద మహిళలను LIC ఏజెంట్లుగా చేస్తారు. ఈ పథకంలో చేరిన తర్వాత మహిళలు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఇంటిదగ్గరనే అందరికి భీమా(ఇన్సూరెన్స్) అందిస్తారు.
భారత ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలను అనుసంధానం చేసి, వారి జీవితాల్లో స్వతంత్రంగా పని చేసేలా అధికారం కల్పించాలని చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 9న పానిపట్ నుండి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

దీని ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయి ఇంకా ఈ పథకం ప్రారంభమైన తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మహిళలను బీమా సఖీగా తీర్చిదిద్దుతామని, ఆ తర్వాత చుట్టుపక్కల మహిళలకి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ పథకం కింద, ప్రతి నెల రూ. 7,000 వరకు సహాయం కూడా అందిస్తుంది. బీమా సఖీ యోజన ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అధికారం కల్పించడం ఇంకా వారికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం.
బీమా సఖీ పథకం కింద మీకు రూ.7 నుంచి 21 వేలు వస్తాయని చెప్పాం. అయితే, మొదటి సంవత్సరంలో మీరు ప్రతి నెలా రూ. 7,000 పొందుతారు, అయితే రెండవ సంవత్సరంలో మీకు రూ. 6,000 ఇవ్వబడుతుందని మీరు తెలుసుకోవాలి. దీని తర్వాత మూడవ సంవత్సరంలో ప్రతి నెల రూ.5,000, మహిళలకు అదనంగా రూ.2,100 అందజేస్తారు. బీమా లక్ష్యాలను చేరుకోవడం ద్వారా కమీషన్ రివార్డు కూడా అందిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ ఎలా జరుగుతుంది అంటే బీమా సఖీ పథకంలో మొదటి దశలో 35,000 మంది మహిళలను బీమా ఏజెంట్లుగా నియమించనున్నారు. తరువాత మెల్లిగా ఈ పథకంలో మరో 50,000 మంది మహిళలను నియమించుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదట డిసెంబర్ 9న బీమా సఖీ పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మహిళ వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి, ఆమె విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ఈ అర్హతలు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications