Credit Cards: క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీ కొంప మునిగినట్లే..!
ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. చాలా మంది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు. కొందరైతే రెండు లేక మూడు క్రెడిట్ కార్డులు కూడా వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డును ఇష్టమొచ్చినట్లు వాడితే మొదటికే మోసం అవుతుంది. అందుకే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడాలి. కొంత మంది క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తారు. ఇది చాలా డెంజర్ అని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వెంటనే మీరు తీసుకున్న డబ్బుపై వడ్డీ పడుతుంది. దీనికి ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఉండదు. వడ్డీ భారీగా ఉంటుంది. బ్యాంకును బట్టి 35 శాతం నుంచి 45 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అంటే దాదాపు రూ.4 వడ్డీ వసూలు చేస్తారని గుర్తుంచుకోవాలి.
క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 2 శాతం నుంచి 3 శాతం ఫీజు కూడా వసూలు చేస్తారు. ఇక కొంత మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బులు తీసుకుంటారు. క్రెడిట్ స్వైప్ చేసుకుని కమీషన్ తీసుకుని డబ్బులు ఇచ్చే వారు ఉంటారు. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడడంతో పాటు తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించకుంటే భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డుతో ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేయకూడదు. అలాగే క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకోకూడదు.

క్రెడిట్ కార్డులతో షాపింగ్, బిల్ పేమెంట్లు చేయవచ్చు. దీనికి దాదాపు 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. అయితే మీరు వాడిన క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించాలి. లేకుంటే దానికి కూడా భారీగా వడ్డీ వసూలు చేస్తారు. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇదేదో బాగానే ఉందని మీరు బిల్లును ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే వడ్డీ కూడా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ కార్డు డబ్బులు డ్రా చేసినే తర్వాత 2 నుంచి 3 శాతం అడ్వాన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న డబ్బుపై ప్రతి రోజూ 35 శాతం నుంచి 45 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications